తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచలో జల్సాలు, ఈజీ మనీకి అలవాటు పడి బైక్‌ల దొంగతనాన్నే వృత్తిగా ఎంచుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి కొట్టేసిన బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ సతీష్ కుమార్ ఈ దొంగతనాలకు సంబంధించిన వివరాలను శనివారం పాల్వంచ పట్టణ పోలీస్ స్టేషన్ వెల్లడించారు. ఈ రోజు ఉదయం పాల్వంచ రూరల్ ఎస్సై సురేష్ తన సిబ్బందితో సోములుగూడెం క్లాస్ రోడ్డు వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ వ్యక్తి భద్రాచలం వైపు నుంచి పాల్వంచ వైపునకు బైక్ మీద వస్తున్నాడు. రోడ్డుపై పోలీసులను చూసి అనుమానాస్పదంగా తచ్చాడుతూ వెనుదిరిగి వెళ్లే ప్రయత్నం చేశాడు. వెంటనే అలెర్ట్ అయిన ఎస్సై తన సిబ్బందితో అతడిని పట్టుకున్నారు. అతడి వద్ద ఉన్న TS 04 EJ 2901 నంబర్ గల గ్లామర్ బైక్‌కు సంబంధించిన పత్రాలు అడిగితే చూపించకలేకపోయాడు. అతని ప్రవర్తన, వ్యవహారశైలి అనుమానస్పదంగా ఉండటంతో ఎస్ఐ గట్టిగా ప్రశ్నించాడు. దీంతో తాను బైక్‌లు దొంగతనం చేస్తున్నట్టు తెలిపాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ద్విచక్రవాహనాలను దొంగిలిస్తున్న ఇతడిని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, చర్ల మండలం, సుబ్బంపేట గ్రామానికి చెందిన సొంతపురి రమేష్ (39)గా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతడు వాడుతున్న TS O4 EJ 2901 గ్లామర్ బైక్ కొద్దిరోజుల క్రితం కేశవాపురంలోని సాయి బాలాజీ ఫంక్షన్ హాల్ దగ్గర దొంగతనం చేశానని రమేష్ పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు. ఇతను జల్సాలకు, చెడు వ్యసనాలకు, ఈజీమణి కోసం దొంగతనాలకు అలవాటు పడి గత ఆరు నెలలుగా జిల్లాలోని కొత్తగూడెం, పాల్వంచ, భద్రాచలం, మణుగూరు, ఇల్లందు తదితర ప్రాంతాల్లో సుమారు 18 బైక్‌లను దొంగతనం చేసినట్టు విచారణలో తెలిపాడు. అందులో ఆరు బైక్‌లను స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ సతీష్ కుమార్ చెప్పారు. మిగతా బైక్‌లను కూడా ఎక్కడ దొంగతనం చేశాడనే వివరాల కోసం విచారణ చేపట్టామని వెల్లడించారు. త్వరలో పూర్తి వివరాలను వెల్లడిస్తామని డీఎస్పీ చెప్పారు. ఈ సందర్భంగా బైక్ దొంగను చాకచక్యంగా పట్టుకున్న రూరల్ ఎస్సై సురేష్‌ను, స్టేషన్ సిబందిని డీఎస్పీ అభినందించారు.
0 Comments