అసోం లోని కార్బీ ఆంగ్‌లోంగ్ జిల్లాలో భారత వైమానిక దళానికి చెందిన సుఖోయ్ - 30 ఎంకేఐ ఫైటర్ జెట్ ప్రమాదానికి గురై కుప్పకూలింది. ఈ యుద్ధ విమానానికి రాడార్ నుంచి సంబంధాలు తెగిపోయినట్లు కేంద్ర రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి. సుఖోయ్ ఆచూకీని గుర్తించేందుకు ఓ వైమానిక దళ బృందాన్ని రంగంలోకి దింపింది. వైమానిక దళ బృందం ఫైటర్ జెట్‌ను గుర్తించింది. ఈ ఘటనలో ఇద్దరు పైలట్లు మృతి చెందారు. మృతులు స్క్వాడ్రన్ లీడర్ అనుజ్, ఫ్లైట్ లెఫ్టినెంట్ పూర్వేష్ దుర్గాకర్‌గా గుర్తించారు. కాగా, 1980లలో రష్యా అభివృద్ధి చేసిన సుఖోయ్ 30 ఎంకేఐ విమానాలు భారత వైమానిక దళానికి వెన్నెముకగా ఉన్నాయి. SU-30 MKI స్క్వాడ్రన్లను ఈశాన్య ప్రాంతంలో భారత వాయుసేన మోహరించింది. ఎస్‌యూ 30sల తొలి డెలివరీ 1997లో రష్యా అందజేసింది. ప్రస్తుతం వీటిని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఉత్పత్తి చేస్తోంది. భారత వైమానిక దళం వద్ద 250కిపైగా ఫైటర్ జెట్లు ఉన్నాయి.
0 Comments