Ad Code

13న రైతుల ఖాతాల్లోకి పీఎం కిసాన్‌ నిధులు


మార్చి 13న పీఎం కిసాన్‌ నిధులు విడుదల కానున్నాయి. అస్సాంలోని గువాహటి వేదికగా నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీ పీఎం కిసాన్‌ నిధులను విడుదల చేయనున్నట్లు కేంద్ర వ్యవసాయశాఖ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. పీఎం-కిసాన్‌ పథకాన్ని 2019లో మోదీ సర్కారు ప్రారంభించింది. ఏటా మూడు దఫాలుగా రూ.2 వేలు చొప్పున మొత్తం రూ.6 వేలు రైతుల ఖాతాల్లో వేస్తారు. ఈ దఫా కోసం మొత్తం రూ.19 వేల కోట్ల నిధులను కేటాయించారు.ఈ పథకం కింద 22వ విడత నిధులను ప్రధానమంత్రి విడుదల చేయనున్నారు. దేశవ్యాప్తంగా 9.32 కోట్ల మంది రైతుల ఖాతాల్లో రూ.2 వేల చొప్పున జమ కానున్నాయి.  

Post a Comment

0 Comments

Close Menu