Ad Code

1205 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్


శ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్నాయనే సంకేతాలకు తోడు, గ్లోబల్ మార్కెట్లలో చమురు ధరలు దిగిరావడంతో బుధవారం సూచీలు వరుసగా రెండో రోజూ వెయ్యికి పాయింట్లు పుంజుకుంది. గ్లోబల్ రిస్క్ సెంటిమెంట్ మెరుగుపడటం, యుద్ధం ఆగుతుందనే ఆశలు నెలకొనడంతో మదుపర్లు కొనుగోళ్లను పెంచారు. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన పురోగతికి ఉన్న అవకాశాల కారణంగా ముడి చమురు ధరలు 100 డాలర్ల దిగువకు వచ్చాయి. ఈ పరిణామాలను మార్కెట్లు సానుకూలంగా తీసుకున్నాయి. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 1205 పాయింట్లు ర్యాలీ చేసి 75,273 వద్ద, నిఫ్టీ 394.05 పాయింట్లు లాభపడి 23,306 వద్ద ముగిశాయి. ఈ క్రమంలోనే ఇన్వెస్టర్ల సంపద మరొకసారి రూ. 8 లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ మార్కెట్ క్యాప్ రూ. 431 లక్షల కోట్లకు చేరుకుంది. బుధవారం సాయంత్రానికి గ్లోబల్ మార్కెట్లలో బ్రెంట్ క్రూడ్ ధర 98.45 డాలర్లుగా ఉంది. 

Post a Comment

0 Comments

Close Menu