ఏఐ చెప్పినట్టు ఇన్వెస్ట్ : 11.08 లక్షలకి 40.47 లక్షల ప్రాఫిట్ : యూజర్ ఎక్స్‌లో పోస్ట్


ఏఐ ఏజెంట్ సాయంతో 11.08 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే, ఆ పెట్టుబడితో 40.47 లక్షల ప్రాఫిట్ వచ్చిందని ఒక యూజర్ ఎక్స్‌లో పోస్ట్ చేయడం ఇప్పుడు స్టాక్ మార్కెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో 0x_Discover అనే యూజర్ చెప్పినట్లు, ఒక AI-పవర్డ్ ట్రేడింగ్ ఏజెంట్ పాలీమార్కెట్‌లో టైమ్ జోన్ ఆర్బిట్రాజ్ అవకాశాలను గుర్తించి రాత్రికి రాత్రే 43,800 డాలర్లు అంటే సుమారు రూ.40,47,120 రిటర్న్స్ ఇచ్చిందని ఆ యూజర్ చెప్పాడు. మనీకంట్రోల్ కథనం ప్రకారం ఆ యూజర్ ఉపయోగిస్తున్న  OpenClaw ఏజెంట్ ఉదయం 3:47 కు అలర్ట్ పంపి 12,000 డాలర్లు అంటే సుమారు 11,08,800 రూపాయలను ఆరు ప్రెడిక్షన్ మార్కెట్లలో పెట్టమని అడిగింది. ఇవి వచ్చే 90 నిమిషాల్లో ఫలితం ఇచ్చేలా ఉన్నాయని ఆ అలర్ట్ సారాంశం. ట్రేడర్ ఆ వివరాల ప్రకారం ట్రేడ్ ప్రారంభించి మళ్లీ నిద్రపోయాడు. తర్వాత లేచి చూసినప్పుడు 12,000 డాలర్ల పెట్టుబడికి 43,800 డాలర్ల రిటర్న్స్ వచ్చాయి. పోస్ట్ ప్రకారం, ఆ AI ఏజెంట్ తొమ్మిది రోజులుగా పనిచేస్తోంది. పాలీమార్కెట్ టైమ్ జోన్ ఆర్బిట్రాజ్ గుర్తించడానికి ఇది రూపొందించబడింది. జపాన్ ప్రభుత్వం RSS ఫీడ్స్, యూరోపియన్ పార్లమెంట్ లైవ్ స్ట్రీమ్స్, ఆస్ట్రేలియా ఫైనాన్షియల్ వైర్స్, మిడిల్ ఈస్ట్ ఫ్లైట్ ట్రాకర్స్, ఆసియా సెంట్రల్ బ్యాంక్ ప్రకటనలు వంటి గ్లోబల్ సమాచారం సోర్సులకు ఏజెంట్ కనెక్ట్ అయింది. యూజర్ చెప్పినట్టే, ఏజెంట్ సింపుల్ రూల్‌తో ప్రోగ్రామ్ చేయబడింది. అమెరికా నిద్రపోయే సమయం అంటే EST 2AM నుంచి 6AM మధ్య మార్కెట్‌లో 30 శాతం కంటే ఎక్కువ ఎడ్జ్ కనిపిస్తే అలర్ట్ పంపుతుంది. ఎక్కువ పాలీమార్కెట్ ట్రేడర్లు US లో ఉన్నందున, గ్లోబల్ ఈవెంట్స్ US రాత్రి సమయంలో జరిగే అవకాశం, ఫలితంగా మార్కెట్ ధరలు ప్రతిస్పందించడానికి చిన్న గ్యాప్ ఉన్నందున ఈ వ్యూహం పనిచేస్తుంది. "ఎడ్జ్ సింపుల్. ఎక్కువ పాలీమార్కెట్ ట్రేడర్లు US లో ఉన్నారు. కానీ గ్లోబల్ ఈవెంట్స్ అమెరికా నిద్రలో ఫలితం చూపిస్తాయి. US లేచేసరికి మార్కెట్లు ముగిశాయి" అని యూజర్ వివరించారు. ఈ పోస్ట్ X లో చర్చకు కారణమైంది. కొంత మంది యూజర్లు ఏఐ ఏజెంట్ల ప్రెడిక్షన్ మార్కెట్ ట్రేడింగ్‌ను మార్చగలవా అని చర్చించారు.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains