పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా 2022 తర్వాత మొదటిసారిగా బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 100 డాలర్లు దాటింది. ఒకానొక సమయంలో ఇది 114 డాలర్లకు కూడా చేరుకుంది. ఇంత భారీ పెరుగుదల ఉన్నప్పటికీ, భారత్‌లో 10 మార్చి 2026 నాటికి పెట్రోల్, డీజిల్ ధరలలో ఎలాంటి మార్పు చేయలేదు. దేశ అవసరాలకు కావాల్సిన ముడి చమురులో దాదాపు 85% విదేశాల నుండే దిగుమతి చేసుకుంటున్నాం. అందుకే గ్లోబల్ మార్కెట్‌లో ధరలు పెరిగితే ఇక్కడ కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే, ప్రభుత్వం మరియు చమురు కంపెనీలు సామాన్యులపై భారం పడకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాయి. చమురు కంపెనీలే కొంతకాలం నష్టాన్ని భరించడం. ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీ (పన్ను) తగ్గించడం ద్వారా ధరలను నియంత్రించడం. ధరల పెరుగుదల తాత్కాలికమే అయితే రేట్లను మార్చకపోవడం వంటి చర్యలు తీసుకుంటాయి. ప్రపంచ చమురు సరఫరాలో ఎక్కువ భాగం హోర్ముజ్ జలసంధి గుండానే సాగుతుంది. ఇక్కడ ఉద్రిక్తతలు పెరిగితే సరఫరా దెబ్బతిని ధరలు మరింత పెరిగే ప్రమాదం ఉంది. పశ్చిమ ఆసియాలో ప్రస్తుత పరిస్థితులు ఈ ఆందోళనను పెంచుతున్నాయి.
0 Comments