Ad Code

రియల్‌మి P4 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభం


10001mAh బ్యాటరీ, 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 4D కర్వ్‌+, 50MP కెమెరాలను కలిగి వున్న రియల్‌మి P4 పవర్‌ 5G స్మార్ట్‌ఫోన్‌ సేల్‌ ప్రారంభమైంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను రియల్‌మి ఇండియా వెబ్‌సైట్‌, రిటైల్‌ అవుట్‌లెట్స్‌, ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.25999, 8GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.27999, 12GB ర్యామ్ + 256GB స్టోరేజీ ధర రూ.30999 గా ఉంది. తొలిసేల్‌లో భాగంగా గరిష్ఠంగా రూ.5999 విలువైన ప్రయోజనాలను అందిస్తామని చెబుతోంది. దీంతోపాటు బ్యాంకు కార్డుల కార్డులపై డిస్కౌంట్‌లను పొందవచ్చు. ఈ ఫోన్‌ ట్రాన్స్‌ సిల్వర్‌, ట్రాన్స్‌ బ్లూ, ట్రాన్స్‌ ఆరెంజ్‌ కలర్‌ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంటుంది. 144Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.8 అంగుళాల 1.5K 4D కర్వ్‌+ హైపర్‌ గ్లో డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 6500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్‌, HDR10+ కంటెంట్‌ను సపోర్టు చేస్తుంది. ఈ ఫోన్‌ ఆర్మర్‌ షెల్‌ ప్రొటెక్షన్‌ను పొందుతుంది. IP66, IP68, IP69 రేటింగ్‌తో డస్ట్‌, వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ హ్యాండ్‌సెట్ 4nm మీడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్‌ను కలిగి ఉంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత Realme UI 7.0 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ 3 ఆండ్రాయిడ్‌ OS అప్‌డేట్స్‌, 4 సంవత్సరాల వరకు సెక్యూరిటీ అప్‌డేట్స్‌ ను పొందుతుందని రియల్‌మి చెబుతోంది. ఈ ఫోన్‌ 4613 sq mm ఎయిర్‌ఫ్లో వేపర్‌ ఛాంబర్‌ను కలిగి ఉంది. దీంతోపాటు హైపర్‌ విజన్‌+ AI చిప్‌ను కూడా కలిగి ఉంది. 90fps BGMI ను సపోర్టు చేస్తుంది. కెమెరా విభాగం పరంగా ఆప్టికల్‌ ఇమేజ్‌ స్టెబిలైజేషన్‌ (OIS) సపోర్టుతో 50MP సోనీ IMX882 ప్రైమరీ కెమెరాను కలిగి ఉంది. దీంతోపాటు 8MP అల్ట్రావైడ్, 16MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంది. ఇది 10001mAh భారీ బ్యాటరీతో పనిచేస్తుంది. 80W వైర్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 27W వైర్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్టును సపోర్టు చేస్తుంది. సింగిల్‌ ఛార్జింగ్‌తో 932.6 గంటల స్టాండ్‌ బై టైంను అందిస్తుందని రియల్‌మి చెబుతోంది. భారీ బ్యాటరీ ఫోన్‌ల కోసం చూసే వారికి ఈ హ్యాండ్‌సెట్‌ అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. సుమారుగా ఒకటిన్నర రోజుల బ్యాటరీ లైఫ్‌ను పొందే అవకాశం ఉందని తెలుస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu