Ad Code

ఇంటి యజమాని వీడియోతో బ్లాక్‌మెయిల్ : మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న మహిళ


పంజాబ్ లోని లూథియానా జాగీర్‌పూర్, సుర్జీత్ కాలనీలో నివసిస్తున్న 32 ఏళ్ల వివాహిత రోజీ, తన ఇంటి యజమాని వీడియోతో బ్లాక్‌మెయిల్ చేయడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఆమె స్నానం చేస్తుండగా నిందితుడు రహస్యంగా వీడియో తీశాడని, ఆపై ఆ వీడియోతో ఆమెను బ్లాక్‌మెయిల్ చేస్తూ వేధించాడని ఆరోపణలు ఉన్నాయి. రోజీ భర్త ఉపాధి నిమిత్తం గత ఐదు నెలలుగా విదేశాల్లో ఉంటున్నారు. వీరికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. రోజీ తండ్రి పాలారామ్ తెలిపిన వివరాల ప్రకారం ఫిబ్రవరి 9న తన కుమార్తె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందనే సమాచారం అందింది. ఆమె మరణానికి ముందు తన మొబైల్ ఫోన్‌లో కొన్ని వీడియో క్లిప్‌లను రికార్డ్ చేసింది. ఆ వీడియోల్లో తన మరణానికి ఇంటి యజమాని సత్నాం (అలియాస్ టింకా) కారణమని నేరుగా ఆరోపించింది. అతను తనను చాలా కాలంగా మానసిక వేధింపులకు గురిచేస్తూ, బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని తన ఆవేదనను వ్యక్తం చేసింది. తమ దర్యాప్తులో భాగంగా టిబ్బా పోలీస్ స్టేషన్‌లో భారతీయ న్యాయ సంహిత సెక్షన్లు 108 (ఆత్మహత్యకు ప్రేరేపించడం), 3(5) కింద కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ బలజీత్ సింగ్ తెలిపారు. ఈ కేసులో ఇంటి యజమాని సత్నాం, అతని భార్య పుష్పపై కేసులు నమోదయ్యాయి. 

Post a Comment

0 Comments

Close Menu