తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకూ సాగుతుంది. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో ఈ మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. 14 వార్డులు ఏకగ్రీవం కాగా.. ఒక వార్డుకు ఎన్నిక వాయిదా పడింది. మొత్తం 12,944 మంది అభ్యర్థులు బరిలో ఉండగా.. వారి భవిష్యత్తును తేల్చేందుకు 52.43 లక్షల మంది ఓటర్లు రెడీ అయ్యారు. వారికోసం 16,031 బ్యాలెట్ బాక్సులు సిద్ధంగా ఉన్నాయి. ఓటర్లు ఎన్నికల సంఘం సూచించిన 12 రకాల గుర్తింపు పత్రాల్లో ఏదైనా ఒకటి వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల్లో గెలుపు ఎవరిది అనేది అత్యంత ఆసక్తికరం. అందుకు అనేక కారణాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ రెండేళ్ల పాలనను పూర్తి చేసుకుంది. అందువల్ల ఆ పార్టీకి ఇంకో మూడేళ్లు ఉన్నా.. చివరి ఏడాది ఎన్నికల ఏడాదిలా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు ఈ ఎన్నికల్లో వచ్చే తీర్పు అనుకూలంగా ఉంటే.. ఆ పార్టీ.. నెక్ట్స్ మూడేళ్ల పాలనలో కొంత రిలాక్స్‌గా ఉంటుంది. లేదంటే.. టెన్షన్ తప్పదు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్.. ప్రభుత్వ వ్యతిరేకతను తనవైపు తిప్పుకొని.. నెక్ట్స్ ఎన్నికల్లో గెలవాలని ప్లాన్ చేస్తోంది. అందుకు మున్సిపల్ ఎన్నికల ద్వారా.. ప్రభుత్వానికి షాక్ ఇవ్వాలి అనుకుంటోంది. అనూహ్యంగా బీజేపీ జోరు పెంచేలా కనిపిస్తోంది. కొన్నాళ్లుగా సైలెంటుగా ఉన్న బీజేపీ నిన్న ఒక్కసారిగా జోరు పెంచింది. ఐతే.. ఇన్నాళ్లూ సైలెంటుగా ఉండటం ఆ పార్టీకి కొంత మైనస్ లాగా కనిపిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదే అని ఆ పార్టీ దీమాగా ఉంది. మరి ఓటర్ల తీర్పు ఎటు అనేది ఆసక్తికరం.
0 Comments