తమిళనాడు రాజధాని చెన్నైలో నోకియా తన అతిపెద్ద నెట్‌వర్క్ పరిశోధనా కేంద్రాన్ని ప్రారంభించింది. ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం భవిష్యత్ అవసరాలకు తగిన విధంగా ఇంటర్నెట్ వేగాన్ని మరింత పెంచే టెక్నాలజీలను అభివృద్ధి చేయడం. ఇక్కడ జరుగుతున్న ముఖ్యమైన పరిశోధనల్లో 100G ఇంటర్నెట్ టెక్నాలజీ. ప్రస్తుతం మనం చాలా వేగంగా భావించే 100 Mbps లేదా 1 Gbps కనెక్షన్లతో పోలిస్తే ఇది వందల రెట్లు అధిక సామర్థ్యం కలిగి ఉంటుంది. ఈ టెక్నాలజీ డేటా ప్రసరణను పూర్తిగా కొత్త స్థాయికి తీసుకువెళ్తుంది. 100G ఇంటర్నెట్ వ్యవస్థ మొత్తం ఫైబర్ ఆప్టిక్ టెక్నాలజీపై ఆధారపడి ఉంటుంది. ఇందులో డేటా విద్యుత్ సంకేతాలుగా కాకుండా, కాంతి తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. ఈ ప్రక్రియలో కోహెరెంట్ ఆప్టిక్స్ అనే ఆధునిక సాంకేతికత ఉపయోగించబడుతుంది. దీని ద్వారా ఒకే ఫైబర్ కేబుల్ ద్వారా భారీ మొత్తంలో డేటాను ఒకేసారి పంపడం సాధ్యమవుతుంది. చెన్నైలోని నోకియా పరిశోధనా కేంద్రం ఈ టెక్నాలజీని మరింత సమర్థవంతంగా మార్చే పనిలో ఉంది. 100G వంటి సూపర్ ఫాస్ట్ వేగాలను సాధించడానికి డీడబ్ల్యూడీఎం కీలక పాత్ర పోషిస్తుంది.
0 Comments