వెనిజులా నుంచి నేరుగా ముడి చమురు కొనుగోలు చేసేందుకు అమెరికా ప్రభుత్వం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ కి 'జనరల్ లైసెన్స్'ను మంజూరు చేసింది. ఈ నిర్ణయంతో గతేడాది కాలంగా ఉన్న అడ్డంకులు తొలగిపోనున్నాయి. డిస్కౌంట్ ధరకే భారీగా చమురు దిగుమతి చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ లైసెన్ తో రిలయన్స్ కంపెనీ ఎలాంటి మధ్యవర్తులు లేకుండా నేరుగా వెనిజులా నుంచి చమురును కొనుగోలు చేసుకోవచ్చు. అలాగే ఎగుమతి చేయవచ్చు, తన రిఫైనరీలలో శుద్ధి చేసుకోవచ్చు. రష్యా చమురుపై ఆంక్షలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. దీంతో వెనిజులా నుంచి లభించే భారీ ముడి చమురును రిలయన్స్ తక్కువ ధరకే కొనుగోలు చేయనుంది. అయితే ఈ మార్పు రావడానికి ఓ కారణం ఉంది. 2025లో అమెరికా విధించిన ఆంక్షల వల్ల రిలయన్స్ వెనిజులా నుంచి దిగుమతులు ఆపేసింది. ఈ ఏడాది జనవరిలో వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా దళాలు అదుపులోకి తీసుకున్నాయి. ఆ తర్వాత అక్కడ రాజకీయ మార్పులు జరిగాయి. దీంతో అమెరికా ట్రెజరీ విభాగం వెనిజులా ఇంధన రంగంపై ఆంక్షలను సడలించింది. తాము ఎంపిక చేసిన కంపెనీలకు లైసెన్సులు జారీ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే రిలయన్స్ కు కూడా లైసెన్స్ వచ్చింది.
0 Comments