బీట్‌రూట్‌లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు చర్మానికి సహజమైన గులాబీ కాంతిని అందించడంలో సహాయపడతాయి.
బీట్‌రూట్ - క్యారెట్ ఫేస్ మాస్క్ : బీట్‌రూట్, క్యారెట్ రసం చర్మాన్ని చల్లబరుస్తూ సహజ కాంతిని ఇస్తాయి… బీట్‌రూట్ రసం, క్యారెట్ రసం సమాన మోతాదులో తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ఐస్ ట్రేలో పోసి ఫ్రీజ్ చేసి తయారు చేసుకోవచ్చు.. ఆ తర్వాత ప్రతి ఉదయం ఒక ఐస్ క్యూబ్‌ను ముఖంపై సున్నితంగా రుద్దాలి. 10-15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగి మాయిశ్చరైజర్ రాయాలి.
బీట్‌రూట్ - పెరుగు ఫేస్ మాస్క్ : చర్మాన్ని హైడ్రేట్ చేసి మృదువుగా మారుస్తుంది. ఒక మధ్యస్థ బీట్‌రూట్ తురిమి, 2 టేబుల్ స్పూన్ల పెరుగు, కొన్ని చుక్కల బాదం నూనె కలపి తయారు చేసుకోవాలి.. ముఖం, మెడపై అప్లై చేసి సున్నితంగా మసాజ్ చేయాలి. 15-20 నిమిషాల తర్వాత నీటితో శుభ్రం చేసుకోవాలి.
బీట్‌రూట్ - క్రీమ్ ఫేస్ మాస్క్ : చర్మంలోని ట్యాన్‌ను తగ్గించడంలో ఈ మాస్క్ సహాయపడుతుంది.. 1 టీస్పూన్ బీట్‌రూట్ రసం, 1 టీస్పూన్ తాజా క్రీమ్ (సోర్ క్రీమ్) కలపి తయారు చేసుకోవచ్చు.. ఇక, ట్యాన్ ఉన్న ప్రదేశాల్లో అప్లై చేసి 20 నిమిషాలు ఉంచాలి. గోరువెచ్చని నీటితో కడగాలి. వారానికి రెండుసార్లు ఉపయోగించవచ్చు.
బీట్‌రూట్ - నారింజ తొక్కల ఫేస్ మాస్క్ : తక్షణ సహజ మెరుపు కోసం ఇది ఉత్తమమైన మాస్క్ ఇది.. 2 టీస్పూన్ల నారింజ తొక్కల పొడి, 1 టీస్పూన్ బీట్‌రూట్ రసం కలిపి మందపాటి పేస్ట్ చేయాలి.. ఆ తర్వాత ముఖం, మెడకు అప్లై చేసి ఆరిన తర్వాత చల్లటి నీటితో కడగాలి. ప్రతి రెండు రోజులకు ఒకసారి ఉపయోగించవచ్చు. బీట్‌రూట్ సాధారణంగా చర్మానికి సురక్షితం. అయితే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది. సున్నితమైన లేదా దీర్ఘకాలిక చర్మ సమస్యలు ఉంటే చర్మవ్యాధి నిపుణుడిని సంప్రదించాలి. ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీ చర్మ సంరక్షణలో మార్పులు చేయడానికి ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.
0 Comments