తెలుగు సినిమాల్లో సహాయ పాత్రలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్న రఘునాథ రెడ్డి గుండెపోటుతో చనిపోయారు. హైదరాబాద్‌లోని కుషాయిగూడలో ఉంటున్న ఈయనకు శనివారం రాత్రి గుండెపోటు రావడంతో మృతి చెందారు. నెలరోజుల క్రితమే ఈయన కొడుకు కూడా గుండెపోటుతో చనిపోయారు. కుమారుడిని కోల్పోయిన బాధతోనే ఈయన కూడా కాలం చేసినట్లు తెలుస్తోంది. రఘునాథరెడ్డి మృతదేహాన్ని సందర్శించిన నటి శివ పార్వతి.. ఈయనకు నివాళి అర్పించారు. ఇంత సీనియర్ నటుడు చనిపోతే.. టాలీవుడ్ పట్టించుకోకపోవడం దురదృష్టకరమని ఈమె ఆవేదన వ్యక్తం చేశారు. రఘునాథ రెడ్డి కలిసుందాం రా, ఒసేయ్ రాములమ్మ, ఇంద్ర, డాన్, తమ్ముడు, రాయలసీమ రామన్న చౌదరి, మల్లీశ్వరి, సంక్రాంతి, శ్రీరామరాజ్యం తదితర చిత్రాలో సహాయ పాత్రలు చేసి గుర్తింపు తెచ్చుకున్నారు. శోభన్ బాబు హీరోగా చేసిన 'సర్పయాగం' సినిమాతో రఘునాథరెడ్డి నటుడిగా పరిచయమయ్యారు. చివరగా 2018లో సుమంత 'సుబ్రహ్మణ్యపురం'లో నటించారు.
0 Comments