తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు రాబోయే 'హైస్పీడ్ రైల్ కారిడార్లు' గేమ్ ఛేంజర్‌గా మారబోతున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుల వల్ల కేవలం ప్రయాణ సమయం తగ్గడమే కాకుండా, ఆర్థిక, హెల్త్ టూరిజం రంగాలు భారీగా వృద్ధి చెందుతాయని మంత్రి ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్ కేంద్రంగా మూడు ప్రధాన నగరాలను కలుపుతూ హైస్పీడ్ రైళ్లు రానున్నాయని మంత్రి వివరించారు. ఈ రైళ్లు గంటకు 350 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
హైదరాబాద్ - బెంగళూరు మధ్య ప్రయాణ సమయం కేవలం 2 గంటలు.
హైదరాబాద్ - పూణే మధ్య ప్రయాణ సమయం కేవలం 1.55 గంటలు.
హైదరాబాద్ - చెన మధ్య ప్రయాణ సమయం కేవలం 2.55 గంటలు.
ఈ ఏడాది బడ్జెట్‌లో తెలంగాణ రైల్వే అభివృద్ధికి కేంద్రం రూ. 5,454 కోట్లు కేటాయించిందని మంత్రి తెలిపారు. గతంతో పోలిస్తే ఈ నిధులు గణనీయంగా పెరిగాయని, రాష్ట్రంలోని రైల్వే మౌలిక సదుపాయాల కల్పనకు ఇది పెద్దపీట వేస్తుందని చెప్పారు. ఈ హైస్పీడ్ కారిడార్ల ద్వారా దక్షిణాది రాష్ట్రాల మధ్య అనుసంధానం పెరిగి, వ్యాపార లావాదేవీలు సులభతరం అవుతాయని అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు.
0 Comments