Ad Code

అవిశ్వాస తీర్మానం ఫలితం తేలేవరకు సభకు హాజరు కాకూడదని నిర్ణయించుకున్న స్పీకర్ ఓం బిర్లా


విపక్షాలు తనపై పెట్టిన అవిశ్వాస తీర్మానం ఫలితం వచ్చే వరకు సభకు హాజరు కాకూడదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా నిర్ణయించుకున్నారు. మార్చి 9వ తేదీన అవిశ్వాస తీర్మానంపై సభలో చర్చ జరుగనుంది. లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లాను పదవి నుంచి తొలగించేలా తీర్మానం ప్రవేశపెట్టేందుకు అవకాశం ఇవ్వాలని లోక్‌సభ సెక్రటరీ జనరల్‌కు కాంగ్రెస్ పార్టీ నోటీసు ఇచ్చింది. ఈ తీర్మానంపై కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకేతో సహా పలు పార్టీలకు చెందిన 120 మంది ఎంపీలు సంతకాలు చేశారు. మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) దూరంగా ఉంది. అవిశ్వాస తీర్మానం నోటీసుపై టీఎంసీ ఎంపీలు సంతకాలు చేయలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 94C కింద లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస నోటీసులు అందించినట్లు కాంగ్రెస్ ఎంపీ, లోక్ సభ ఉప ప్రతిపక్ష నేత గౌరవ్ గొగోయ్ మీడియాకు వెల్లడించారు.

Post a Comment

0 Comments

Close Menu