Ad Code

చున్నీతో భార్యను హత్య చేసిన భర్త : పోలీసులకు పట్టించిన కుమారులు


ఢిల్లీలోని సుల్తాన్‌పురి ప్రాంతంలో శనివారం మధ్యాహ్నం ఒక ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఆగ్రహించిన భర్త అనిల్‌ చున్నీతో భార్య గొంతునొక్కి చంపాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న 10, 13 ఏళ్ల కుమారులు ఇది చూసి పోలీసులకు తండ్రిని పట్టించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. అచేతనంగా పడి ఉన్న మహిళను ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఈ నేపథ్యంలో మద్యం తాగి గొడవ పడిన తండ్రి తమ తల్లిని చంపినట్లు ఇద్దరు కుమారులు పోలీసులకు చెప్పారు. దీంతో అనిల్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu