Ad Code

ఉద్యోగులందరికీ బోనస్ ప్రకటించిన కాగ్నిజెంట్


కాగ్నిజెంట్ అర్హులైన ఉద్యోగులందరికీ 100 శాతం బోనస్ అందజేయనున్నట్లు కంపెనీ అధికారికంగా ప్రకటించింది. వాస్తవానికి కంపెనీ నిర్దేశించుకున్న ఆర్థిక లక్ష్యాలను 2027 నాటికి చేరుకోవాలని భావించగా.. ఉద్యోగుల కృషి ఫలితంగా రెండేళ్ల ముందే అంటే 2025లోనే ఆ ఘనతను సాధించింది. ఈ అద్భుత విజయానికి గుర్తుగా ఉద్యోగులకు ఈ రివార్డును ప్రకటించినట్లు సీఈఓ ఎస్. రవికుమార్ వెల్లడించారు. 2025లో కంపెనీ ఆదాయం 7% పెరిగి 21.10 బిలియన్ డాలర్లకు (సుమారు రూ.1.90 లక్షల కోట్లు) చేరింది. కాగ్నిజెంట్‌కు ప్రపంచవ్యాప్తంగా 3.50 లక్షల మంది ఉద్యోగులు ఉండగా, అందులో అత్యధికులు భారత్‌లోనే పనిచేస్తున్నారు. వారందరికీ ఈ నిర్ణయం పెద్ద ఊరటనివ్వనుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమ లాభాలు ఆర్జించే అగ్రశ్రేణి ఐటీ సంస్థల జాబితాలో కాగ్నిజెంట్ స్థానం సంపాదించుకుంది.


Post a Comment

0 Comments

Close Menu