Ad Code

సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేత : అధ్యయనం చేస్తున్నామన్న కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ


విదేశాలపై సుంకాలు విధించే హక్కు అమెరికా అధ్యక్షుడికి లేదని, కేవలం కాంగ్రెస్ కు మాత్రమే ఉందని అమెరికా సుప్రీంకోర్టు తేల్చేచెప్పింది. దీంతో భారత్ పై తగ్గింపుల తర్వాత 18 శాతానికి చేరిన సుంకాలు కాస్తా 10 శాతానికి తగ్గాయి. దీనిపై ట్రంప్ స్పందించి తదుపరి చర్యల్ని కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో భారత్ ఇవాళ తాజా పరిణామాలపై స్పందించింది. అమెరికా సుంకాల పరిణామాలు, వాటి పర్యవసానాలను భారత ప్రభుత్వం అధ్యయనం చేస్తోందని వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలిపింది. అమెరికా సుప్రీంకోర్టు తీర్పును పరిగణనలోకి తీసుకుని, ఈ విషయంలో ట్రంప్ నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని ప్రస్తావించింది. సుంకాలపై నిన్న అమెరికా సుప్రీంకోర్టు తీర్పును తాము గమనించామని, ఈ విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా విలేకరుల సమావేశంలో ప్రసంగించారని కేంద్రం తెలిపింది. సుప్రీంకోర్టు తన గత దిగుమతి సుంకాలను ఎత్తివేసిన కొన్ని గంటల తర్వాత, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ అన్ని దేశాల నుండి దిగుమతులపై 10% సుంకం విధిస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేశానని వెల్లడించారు. ఇది తన వాణిజ్య ఎజెండాను పెంచుతుందన్నారు. కొత్త సుంకాలు ఫిబ్రవరి 24న ఉదయం 10:31 గంటలకు భారత కాలమానం ప్రకారం అమల్లోకి రానున్నాయి. డొనాల్డ్ ట్రంప్ సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేయడంతో, ఆ దేశం తాత్కాలికంగా 10 శాతం దిగుమతి సర్‌ఛార్జ్ విధిస్తూ కొత్త ఉత్తర్వు జారీ చేయడంతో, భారతీయ వస్తువులు ఫిబ్రవరి 24 నుండి 10 శాతం పరస్పర సుంకాన్ని మాత్రమే ఎదుర్కొంటాయని వైట్ హౌస్ స్పష్టం చేసింది.

Post a Comment

0 Comments

Close Menu