Ad Code

నమో భారత్ రైలు, మీరట్ మెట్రోను ప్రారంభించిన మోడీ


త్తర ప్రదేశ్‌లోని మీరట్ నగరంలో మీరట్ మెట్రో, నమో భారత్ రైలు సేవలను ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం ప్రారంభించారు. దేశంలోనే అత్యంత వేగంగా నడిచే మెట్రో రైలు ఇది. దీని గరిష్ఠ వేగం సుమారు గంటకు 120 కిలోమీటర్లు. ప్రస్తుతం భారతదేశంలోని ఇతర మెట్రో వ్యవస్థల సాధారణ గరిష్ఠ వేగం సుమారు గంటకు 80-90 కిలోమీటర్ల మధ్య ఉంటుంది. ఇవాళ శతాబ్దీ నగర్ నమో భారత్ స్టేషన్‌ను మోడీ సందర్శించారు. రూ.12,390 కోట్ల విలువైన ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు. ఆయన ప్రారంభించిన మెట్రో సేవలు ఇవాళ సాయంత్రం నుంచి ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. అలాగే, నమో భారత్‌ రైలు ఢిల్లీ నుంచి మీరట్ మధ్య గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. దీని గరిష్ఠ వేగం గంటకు 180 కిలోమీటర్లు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రాంతీయ రవాణా వ్యవస్థల విస్తరణ కార్యక్రమంలో భాగంగా వీటిని మోడీ ప్రారంభించారు. 

Post a Comment

0 Comments

Close Menu