Ad Code

అమెరికా చేతిలో ప్రధాని మోడీ కీలుబొమ్మ !


మెరికా చేతిలో ప్రధాని మోడీ కీలుబొమ్మ అంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధక్షురాలు వైఎస్ షర్మిల ఎక్స్‌లో ట్వీట్ చేశారు. జరిగింది ట్రేడ్ డీల్ కాదు, ఇండియాకు బ్లాక్ డీల్ అని విమర్శించారు. దేశ రైతంగానికి, పరిశ్రమల రంగానికి బ్లాక్ డే అని షర్మిల ఎక్స్‌లో రాశారు. అగ్రరాజ్యం బ్లాక్ మెయిల్‌కి తలొగ్గి దేశ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టడం దారుణమని, ఈ డీల్ దేశ భవిష్యత్‌కే పొంచి ఉన్న ప్రమాదమని షర్మిల పేర్కొన్నారు. సున్నా సుంకాలతో భారత మార్కెట్ ను అమెరికా ఉత్పత్తులు శాసించాయంటే స్వదేశీ ఉత్పత్తులకు ఇది మరణశాసనమే అని చెప్పారు. మోడీ చేసిన బ్లాక్ డీల్ మన రూపాయి భవితవ్యాన్ని దెబ్బతీసేలా ఉంది. ఇండియా ఎగుమతులపై అమెరికా సుంకాలు 18 శాతం తగ్గిస్తే, ఆ దేశ దిగుమతులపై మోడీ సుంకాలు సున్నా చేయడం ఏంటి ? అని షర్మిల ప్రశ్నించారు. మన దేశ ఉత్పత్తులపై మొన్నటిదాకా అమెరికా వేసిన పన్నులు కేవలం 5 శాతం లోపే. 5 నుంచి 50 శాతం పన్నులు పెంచి, అందులో 18 శాతానికి కుదిస్తే ఇండియాకు ప్రయోజనం ఎలా అవుతుంది ? మన దేశానికి భారీ లాభం ఎలా చేకూరింది ? సుంకాలు తగ్గింపుతో భారత్ కి దక్కే ప్రయోజనం కంటే సున్నా సుంకాలతో అమెరికాకు మాత్రం 100 శాతం లాభం. ఇండియా రైతులకు ఉరి పెట్టీ, అమెరికా వ్యవసాయానికి మోడీ గ్రేట్ డీల్ ఇచ్చారు. ట్రంప్ కోసం మేక్ ఇన్ ఇండియా స్లోగన్ కి మోడీ తిలోదకాలు ఇచ్చారు. రష్యా క్రూడ్ ఆయిల్ తీసుకున్నారంటే మళ్ళీ సుంకాలు 50 శాతం పెంచుతామని ట్రంప్ బహిరంగంగా అంటున్నారంటే ఇది బ్లాక్ మెయిల్ కాదా ? ట్రంప్ పెట్టిన భయానికి మోడీ బయటపడ్డారంటే సాగిలపడ్డట్లు అనిపించుకోదా ? అని షర్మిల ప్రశ్నించారు.

Post a Comment

0 Comments

Close Menu