రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం సోదరులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సడలింపు ఈనెల 19వ తేదీ నుండి వచ్చే నెల 20వ తేదీ వరకు అమల్లో ఉండనుంది. రంజాన్ ప్రార్థనలు, ఆచారాలను సౌకర్యంగా నిర్వహించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సంబంధిత విభాగాలు ఉత్తర్వులను అమలు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
0 Comments