Ad Code

ఆంధ్రప్రదేశ్‌లో విద్యార్థుల ఆర్టీఈ ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల


ఆంధ్రప్రదేశ్‌లో 2026-27 విద్యా సంవత్సరం మరికొన్ని నెలల్లో మొదలవ్వబోతోంది. విద్యా హక్కు చట్టం ప్రకారం ప్రైవేటు స్కూళ్లలో 25 శాతం సీట్లలో విద్యార్థులకు ఉచిత కోటా ఉంది. అందువల్ల తమ పిల్లల్ని ప్రైవేట్ స్కూళ్లలో చదివించాలి అనుకుంటూ ఆర్థికంగా స్తోమత లేని తల్లిదండ్రులు దీనిని ఉపయోగించుకోవచ్చు. తద్వారా తమ పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచిత విద్యను అందించవచ్చు. ఈ ఉచిత కోటా సీట్ల ప్రవేశాలకు సంబంధించి షెడ్యూల్ ఇప్పుడు రిలీజ్ అయ్యింది. విద్యా హక్కు చట్టం ప్రకారం ఆర్థికంగా వెనకబడిన, పేద పిల్లలకు ప్రైవేటు స్కూళ్లలో ఫ్రీ ఎడ్యుకేషన్ కల్పించడం ప్రభుత్వ లక్ష్యం. ఇందులో ప్రైవేట్ స్కూళ్లేమీ ఫ్రీగా చదువు చెప్పవు. ఆ ఫీజుల్ని పిల్లల తరపున ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రస్తుతం ఒకటో తరగతి ప్రవేశాలకు ఫిబ్రవరి 20 నుంచి దరఖాస్తులు తీసుకుంటారు. ముందుగా అధికారిక వెబ్‌సైట్ https://cse.ap.gov.in కి వెళ్లండి. ఇందులో మీకు RTE సెక్షన్‌ ఉంటుంది. అందులో ఆన్‌లైన్ అప్లికేషన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేసి అందులో వివరాలు ఎంటర్ చేసి, సబ్‌మిట్ కొడితే అప్లికేషన్ వెళ్లిపోతుంది. రిఫరెన్స్ కోసం ఒక ఐడీ నంబర్ ఇస్తారు. దాన్ని సేవ్ చేసుకుంటే ఫ్యూచర్‌లో చెక్ చెయ్యడానికి పనికొస్తుంది. ఈ దరఖాస్తు ప్రక్రియ మీకు ఇబ్బందిగా అనిపిస్తే  గ్రామ లేదావార్డు సచివాలయాల్లో కూడా చేసి పెడతారు. అలాగే మండల విద్యా రిసోర్స్ సెంటర్లు, సంబంధిత ప్రైవేటు స్కూళ్ల ద్వారా కూడా దరఖాస్తు పెట్టుకోవచ్చు. రాష్ట్ర సిలబస్ స్కూళ్లలో ఒకటో తరగతి ప్రవేశానికి పిల్లలు 2020 జూన్ 2 నుంచి 2021 మే 31 మధ్య జన్మించి ఉండాలి. అంటే వారి వయస్సు 2026 జూన్ నాటికి సుమారు 5 నుంచి 6 ఏళ్ల వయసు ఉండాలి.


Post a Comment

0 Comments

Close Menu