వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయనున్న సంపత్


మెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ మేయర్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు తమిళ మూలాలున్న సంపత్ (31) ప్రకటించారు. డెమొక్రాట్ల ప్రైమరీలో అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నానని, రాజధాని నగరంలో మౌలిక వసతులను పెంచడం, పాలనపై ప్రజలకు విశ్వాసం కలిగించడమే తన ప్రధాన ధ్యేయమని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న ఆమె, ప్రస్తుత నగర నాయకత్వంపై విమర్శలతో తన ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. ''నగర పాలనలో మేయర్‌గా కనీస హామీలను నెరవేర్చడమే నా ప్రాధాన్యత. రహదారులపై గుంతలు పూడ్చడం, మురుగునీటి సమస్యను పరిష్కరించడం, నిత్యావసరాల ధరలు తగ్గించడం, అత్యవసర సహాయం 911 కాల్స్ వెయిటింగ్ సమయం తగ్గించడం వంటివి చేస్తాను'' అని రిని సంపత్ వాగ్దానం చేశారు. విధి నిర్వహణలో ప్రాథమిక విధులు నిర్వర్తించడంలో విఫలమైన ఉద్యోగులకు పదోన్నతలు ఎందుకు ఇవ్వాలని ఆమె నిలదీశారు. నగర కౌన్సిల్‌లో అనేక ఏళ్లుగా పనిచేస్తున్న రాజకీయ నేతలపై పరోక్షంగా ఆమె విమర్శలు గుప్పించారు. ఇటీవల సంభవించిన మంచు తుపానుతో రహదారులు, ఫుట్‌పాత్‌లు ప్రమాదకరంగా మారాయని, వీధుల్లో చెత్త పేరుకుపోయిందని, పైపులైన్లు పగిలిపోయాయని ఆమె అన్నారు. ఈ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న జనం పనులకు వెళ్లలేక ఆదాయం కోల్పోయారని అన్నారు. వ్యాపారాలు కూడా దెబ్బతిన్నాయని తన ప్రచార వీడియోలో ఆమె పేర్కొన్నారు. 

Post a Comment

0 Comments