Ad Code

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ టైమింగ్స్ లో స్వల్ప మార్పు


సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి నడుపుతున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 20707 టైమింగ్ లో తూర్పు కోస్తా రైల్వే స్వల్ప మార్పు చేపట్టింది. విశాఖపట్నం స్టేషన్ లో అంతకంతకూ పెరిగిపోతున్న రైళ్ల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ మార్పు చేశారు. ఇప్పటివరకూ సికింద్రాబాద్ నుంచి విశాఖకు వస్తున్న వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు మధ్యాహ్నం 1.45కు వస్తుండగా దీన్ని కాస్తా మరో ఐదు నిమిషాల టైం పొడిగించి 1.50కు వచ్చేలా మార్పు చేశారు. ఈ మార్పు రేపటి నుంచి అమల్లోకి వస్తుందని తూర్పు కోస్తా రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది. ఇది మినహా సికింద్రాబాద్-విశాఖపట్నం వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు రాకపోకల్లో ఎలాంటి మార్పులూ లేవు. ఇప్పటికే పూర్తి రద్దీతో నడుస్తున్న ఈ రైలులో ప్రయాణాలకు ముందస్తుగా బుకింగ్ చేసుకోవాల్సి వస్తోంది. చివరి నిమిషంలో ప్రయాణాలు చేయాలంటే ఇబ్బందులు తప్పడం లేదు. అయితే విశాఖ స్టేషన్లో ప్రస్తుతం చేసిన ఐదు నిమిషాల సమయం మార్పు ప్రభావం ప్రయాణికులపై అంతగా ఉండకపోవచ్చు. మరోవైపు విశాఖ స్టేషన్లో రద్దీ కాస్త తగ్గుతుంది. మరోవైపు దుర్గ్ నుంచి విశాఖకు వచ్చే మరోవందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు నంబర్ 20829 టైమింగ్ లోనూ మార్పు చేశారు. మధ్యాహ్నం 1.50కు విశాఖకు రావాల్సిన ఈ రైలును ఐదు నిమిషాలు ఆలస్యంగా 1.55కు వచ్చేలా మార్చారు. 

Post a Comment

0 Comments

Close Menu