తెలంగాణలోని కొండగట్టు ఆంజనేయునిఆలయంలో హీరో అర్జున్ సర్జా ప్రత్యేక పూజలు చేశారు. కొండగట్లు అంజన్న ఆలయాన్ని తన కూతురు ఐశ్వర్య అర్జున్‌తో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. తాను మొదటిసారి ఈ క్షేత్రానికి వచ్చానని అర్జున్ తెలిపారు. సీతాపయనం మూవీ రిలీజ్ తర్వాత కొండగట్టుకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా అర్జున్ మాట్లాడుతూ 'ఆంజనేయస్వామి ఆలయానికి రావడం అంటే నాకు చాలా ఇష్టం. కొండగట్టు చాలా సార్లు విన్నా. అందుకే మొదటిసారి ఇక్కడికి వచ్చా. ఈ ఆలయానికి రావాలని చాలా రోజులుగా అనుకుంటున్నా. సీతాపయనం మూవీ రిలీజ్ సందర్భంగా కొండగట్టుకు రావడం చాలా ఆనందంగా ఉంది. అందరికీ మంచి జరగాలి. సర్వేజనా సుఖినోభవంతు' అని అన్నారు.
0 Comments