Ad Code

యువకుడిని బలి తీసుకున్న పబ్జి గేమ్‌


త్తరప్రదేశ్‌లోని మీరట్ ప్రాంతానికి చెందిన మహమ్మద్ కైఫ్ అనే యువకుడికి ఆన్‌లైన్ గేమ్‌లు ఆడటం అలవాటు. రాత్రుళ్లు హెడ్‌ఫోన్లు పెట్టుకుని తెల్లవార్లూ పబ్జీ ఆడటాన్ని అలవాటుగా మార్చుకున్నాడు. ఇంట్లో వారు హెచ్చరించినప్పటికీ అతను వినేవాడు కాదు. గత కొన్ని రోజుల క్రితం, అర్థరాత్రి గేమ్ ఆడుతుండగా అతనికి తీవ్రమైన తలనొప్పి వచ్చింది. ఆ వెంటనే కైఫ్ అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. కుటుంబ సభ్యులు అతడిని వెంటనే మీరట్‌లోని ప్రైవేట్ ఆసుపత్రికి, ఆపై మెరుగైన చికిత్స కోసం ఢిల్లీకి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు కైఫ్ రక్తపోటు 300 దాటిందని (సాధారణంగా 120/80 ఉండాలి) గుర్తించారు. అంతటి అధిక రక్తపోటు వల్ల మెదడులోని నరం పగిలి రక్తస్రావం జరగడంతో అతను మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. కైఫ్ తండ్రి ఫరూక్ మాట్లాడుతూ తన కుమారుడు గత పదేళ్లుగా హైబీపీ సమస్యతో బాధపడుతున్నాడని, దానికి చికిత్స తీసుకుంటున్నాడని తెలిపారు. 

Post a Comment

0 Comments

Close Menu