ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడులో శ్రీచైతన్య స్కూల్‌కు అనుబంధంగా నడుస్తున్న నవోదయ కోచింగ్ సెంటర్‌లో 11 ఏళ్ల సయ్యద్ తౌఫిక్ అనే విద్యార్థి బాత్రూమ్‌లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది.ఏడాది కాలంగా కోచింగ్ సెంటర్‌లో కోచింగ్ తీసుకుంటున్న విద్యార్ధి బాత్రూమ్‌లో ఉరివేసుకున్న స్థితిలో అనుమానాస్పదంగా మృతి చెందడంతో బంధువులు, గ్రామస్థులు ఆందోళనకు దిగారు. కోచింగ్ సెంటర్ వార్గెన్ విద్యార్ధిని కొట్టి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడంటూ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్ధి సంఘాల మద్దతుతో ధర్నా చేశారు. పోలీసులు జోక్యం చేసుకొని విచారణ చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు.
0 Comments