Ad Code

80 శాతం కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ వాడుకుంది : అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదు


హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌ నుంచి మాజీ మంత్రి హరీష్‌రావు మీడియాతో మాట్లాడుతూ కృష్ణా జలాల 664 టీఎంసీలను , 80 శాతం ఆంధ్రప్రదేశ్ వాడుకుందని తెలంగాణ ఈఎన్‌సీ, కేఆర్‌ఎంబీకి లేఖ రాశారని, మరి ఏపీ ప్రభుత్వం 80 శాతం నీళ్ళు వాడుకుంటే , రేవంత్ రెడ్డి , ఉత్తమ్‌లు గాడిద పళ్లు తోముతున్నారా?, 80 శాతం నీళ్ళు వాడుకుంటే, తెలంగాణ ప్రభుత్వం నిద్ర పోతుందా? అని నిలదీశారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ ఎందుకు ఏర్పాటు చేయడం లేదని , ఆ కౌన్సిల్‌ మీటింగ్‌ ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్‌ డిమాండ్‌ చేస్తుందని హరీష్‌ స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కులను సీఎం రేవంత్‌రెడ్డి కాపాడాలని, ఈఎన్‌సీ పోస్టుల భర్తీపై సైతం సర్కార్‌ నిర్లక్ష్యంగా ఉందని హరీష్‌ మండిపడ్డారు.

Post a Comment

0 Comments

Close Menu