Ad Code

త్వరలో వివో వీ70, వివో వీ70 ఎలైట్ మోడల్స్ విడుదల


వివో మరోసారి స్మార్ట్‌ఫోన్ డిజైన్ విషయంలో తన ప్రత్యేకతను చాటుకుంది. తాజాగా విడుదలైన వివో వీ70, వివో వీ70 ఎలైట్ మోడల్స్ చూపులు తిప్పుకోకుండా ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్లను చేతిలో పట్టుకుంటే ప్రీమియం ఫీల్ ఇస్తోంది. వివో వీ70 సిరీస్ భారత మార్కెట్‌లో రూ.45,999 ప్రారంభ ధరతో విడుదలయ్యే అవకాశం ఉంది. 8GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్‌ ధర ఇది. ప్రీమియం డిజైన్‌తో పాటు శక్తివంతమైన హార్డ్‌వేర్‌ను అందిస్తూ ఈ ఫోన్ మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో గట్టి పోటీ ఇవ్వనుంది. ఇందులో 6.59 అంగుళాల 1.5K రిజల్యూషన్ 120Hz LTPS OLED స్క్రీన్ ఇవ్వనున్నట్లు సమాచారం. స్మూత్ స్క్రోలింగ్, వైబ్రెంట్ కలర్స్‌తో మల్టీమీడియా అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లేలా ఈ డిస్‌ప్లే రూపొందించినట్లు తెలుస్తోంది. Qualcomm Snapdragon 7 Gen 4 చిప్‌సెట్‌ను అందించనున్నారు. మెమరీ పరంగా LPDDR5X RAM, UFS 4.1 స్టోరేజ్ ఉండటంతో స్పీడ్, మల్టీటాస్కింగ్‌లో ఎలాంటి ఇబ్బంది ఉండదు. వివో వీ70 వెనుక భాగంలో 50MP Sony IMX766 ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా వైడ్ లెన్స్, అలాగే 50MP IMX882 3x పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఇవ్వనున్నట్లు సమాచారం. ఫోటోగ్రఫీ, జూమ్ విషయంలో ఇది కీలక అప్‌గ్రేడ్‌గా నిలవనుంది. సెల్ఫీ ప్రేమికుల కోసం ముందు భాగంలో 50MP JN1 ఫ్రంట్ కెమెరా అందించనున్నారు. 6500mAh భారీ బ్యాటరీతో పాటు 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇవ్వనున్నారు. ఒకరోజు కంటే ఎక్కువ బ్యాటరీ బ్యాక్‌అప్‌తో పాటు తక్కువ సమయంలో ఫుల్ ఛార్జ్ అయ్యే సౌకర్యం లభించనుంది. IP68 / IP69 రేటింగ్తో డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కూడా అందించనున్నట్లు సమాచారం. ఇది ఈ సెగ్మెంట్‌లో అరుదైన ఫీచర్. ప్రీమియం డిస్‌ప్లే, శక్తివంతమైన ప్రాసెసర్, పెరిస్కోప్ కెమెరా, భారీ బ్యాటరీతో Vivo V70 మిడ్‌రేంజ్ సెగ్మెంట్‌లో గేమ్‌చేంజర్‌గా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

Post a Comment

0 Comments

Close Menu