Ad Code

47 మంది ఉద్యోగులకు ఖరీదైన లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చిన హైలైట్ గ్రూప్ సంస్థ


కేరళ రాష్ట్రంలో రిటైల్ స్పేస్ రంగంలో అగ్రగామిగా కొనసాగుతున్న  హైలైట్ గ్రూప్ తమ సంస్థ అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించడంతో పాటు కంపెనీ ప్రారంభం నుంచి వున్న  47 మంది ఉద్యోగులకు ఖరీదైన లగ్జరీ కార్లను బహుమతిగా ఇచ్చి కంపెనీ సన్మానించింది. దీని కోసం కంపెనీ ఏకంగా రూ.20 కోట్లు ఖర్చు చేయడం గమనార్హం. ఈ కంపెనీ ప్రారంభించి 30 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కాలికట్‌లో నిర్వహించిన వేడుకల్లో కంపెనీకి చెందిన ఉద్యోగులకు ఖరీదైన బహుమతులను అందజేసింది. వీటిలో రేంజ్ రోవర్, ఆడి క్యూ8, లాండ్ రోవర్ డిఫెండర్, టాటా హరియర్, కియా సెల్టోస్, హ్యూండాయ్ క్రెటా, స్కోడా కైలాక్ వంటి ఖరీదైన మోడళ్లు ఉన్నాయి. అంతేకాకుండా, వచ్చే 2030 నాటికి కంపెనీని మరింతగా విస్తరించి 2 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హైలైట్ గ్రూపు కంపెనీ యాజమాన్యం ఈ సందర్భంగా ప్రకటించింది. 

Post a Comment

0 Comments

Close Menu