రూ.3,32,205 కోట్లతో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

Saturday, February 14, 2026

205 crore 32 Andhra Pradesh Finance Minister Payyavula Keshav presented the state budget with Rs. 3 Presenting the budget for the third time

t f B! P L


ఆంధ్రప్రదేశ్  2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ శాసన సభలో ప్రవేశపెట్టారు. వరుసగా మూడోసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆయన, ఒకసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌తో పాటు రెండుసార్లు పూర్తి స్థాయి బడ్జెట్‌ను ప్రకటించారు. ఈ ఆర్థిక సంవత్సరానికి రూ. 3,32,205 కోట్లతో బడ్జెట్ ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం రూ. 2,56,143 కోట్లు కాగా, మూలధన వ్యయం రూ. 53,915 కోట్లు గా పేర్కొన్నారు. రెవెన్యూ లోటు రూ. 22,002 కోట్లు ఉండగా.. ద్రవ్య లోటు రూ. 75,868 కోట్లు గా వెల్లడించారు. అయితే.. ప్రాధాన్యత రంగాలకు భారీగా కేటాయింపులు చేసారు. డిప్యూటీ సీఎం పవన్.. లోకేష్ శాఖలతో సహా సంక్షేమానికి కేటాయింపుల్లో ప్రాధాన్యత లభించింది. ఆర్దిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ లో పోలవరానికి రూ.6,105 కోట్లు కేటాయింపులుగా వెల్లడించారు. విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ ప్లాన్‌ను ఇప్పటికే సిద్ధం చేశామని.. విశాఖ, అమరావతి, తిరుపతి రీజియన్లను రాష్ట్రానికి కీలక గ్రోత్‌ ఇంజిన్లుగా గుర్తింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా రాయలసీమ రీజియన్‌ను గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా మార్చాలని కంకణం కట్టుకున్నామని చెప్పారు. 2030 నాటికి ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని 14.41 లక్షల హెక్టార్లకు పెంచబోతున్నట్లు వెల్లడించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి రూ.6 వేల కోట్లు ప్రతిపాదించారు. విద్యుత్‌ రంగానికి రూ.13,934 కోట్లు, రోడ్లు, పోర్టు, ఎయిర్‌పోర్టులకు రూ.13,546 కోట్లు, పరిశ్రమలకు రూ.3,161 కోట్లు, సర్దుబాటు నిధి రూ.1,500 కోట్లు, వీబీ జీ రామ్‌ జీకి రూ.8365 కోట్లు, గృహ నిర్మాణ రంగానికి రూ.5,451 కోట్లు, ఎన్టీఆర్‌ వైద్య సేవకు రూ.4000 కోట్లు, జల్‌ జీవన్‌కు రూ.4,000 కోట్లు, స్వచ్ఛ భారత్‌ మిషన్‌కు రూ.1,037 కోట్లు, విశాఖ ఆర్థిక ప్రాంతానికి రూ.28,000 కోట్లు ప్రతిపాదించారు. అదే విధంగా ఎన్టీఆర్ భరోసా - రూ.27,719 కోట్లు, దీపం 2.0 - రూ.2,601 కోట్లు, వివిధ వర్గాలకు ఆర్ధిక మద్దతు - రూ.2,320 కోట్లు, స్త్రీశక్తి - రూ.1,420 కోట్లు, వీకర్ సెక్షన్లకు సబ్సిడీ, ఉచిత విద్యుత్ - రూ.600 కోట్లు, ఆటో డ్రైవర్ల సేవలో - రూ.450 కోట్లు, తల్లికి వందనం - రూ.9,668 కోట్లు, స్త్రీ, శిశు సంక్షేమం - రూ.4,581 కోట్లు, ఉపకారవేతనాలు - రూ.3,836 కోట్లు, సమగ్ర శిక్ష - రూ.2,946 కోట్లు, ఉన్నత విద్య - రూ.2,566 కోట్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం - రూ.2,161 కోట్లు, మన బడి, మన భవిష్యత్ - రూ.1,500 కోట్లు, నైపుణ్యాభివృద్ధి - రూ.1,232 కోట్లు, పీఎం స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా - రూ.707 కోట్లు, సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్ధి మిత్ర - రూ.654 కోట్లు, యువత, క్రీడలు - రూ.438 కోట్లు, మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు - రూ.9,906 కోట్లు, అన్నదాత సుఖీభవ - రూ.6,600 కోట్లు, పోలవరం - రూ.6,105 కోట్లు, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన - రూ.1,927 కోట్లు, ధరల స్థిరీకరణ నిధి - రూ.500 కోట్లు, మత్స్యకార సేవలో - రూ.260కోట్లు, పంటల బీమా - రూ.250 కోట్లు, పీఎం కృషి సించాయి యోజన రూ.190 కోట్లుగా బడ్జెట్ లో కేటాయింపులు చేసారు.లో తెలిపారు.

Advertisement

Random Post

    Total Pageviews

    Search This Blog

    AsSencse 2

    About Us

    AP TO TG COMPUTER TECH

    ver-1

    1

    Contact Form

    No Thumbnail

    LATEST NEWS AP TO TG
    LATEST NEWS AP TO TG

    #Tech

    Tech

    #Smartphone

    Smartphone

    Categories

    Main Tags

    Translate

    #Advertisement

    Featured Posts

    {getFeatured} $label={recent} $region={Andhra Pradesh}

    #Advertisement


    8/related/default

    QooQ