Ad Code

మార్చి 31 నాటికి దేశాన్ని మావోయిస్టు హింస నుంచి విముక్తి చేయడంలో విజయం సాధిస్తాం : కేంద్ర హోం మంత్రి అమిత్ షా


ఢిల్లీ పోలీసుల 79వ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ '2014కి ముందు 3-4 దశాబ్దాలుగా మూడు సమస్యలు మన అంతర్గత భద్రతకు తీవ్రమైన సవాలుగా నిలిచాయి. కాశ్మీర్ ప్రాంతం, మొత్తం ఈశాన్య ప్రాంతం. పదకొండు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు. అయితే ఆర్టికల్ 370 రద్దు తర్వాత కాశ్మీర్, ఈశాన్య, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో హింసను 80 శాతం తగ్గించడంలో మేము విజయం సాధించామని మీకు తెలియజేయడానికి నేను సంతోషిస్తున్నాను. 2026 మార్చి 31 నాటికి మొత్తం దేశాన్ని మావోయిస్టు హింస నుంచి విముక్తి చేయడంలో విజయం సాధిస్తామని నేను దేశ ప్రజలకు భరోసా ఇవ్వాలనుకుంటున్నాను..'' అని అమిత్ అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu