Ad Code

అమ్మకాల్లో యాపిల్‌ హవా : మార్కెట్‌లో 28 శాతం పెరిగిన యాపిల్‌ వాటా


దేశీయంగా అమ్మకాల్లో యాపిల్‌ హవా కొనసాగుతోంది. కౌంటర్‌పాయింట్‌ రీసెర్చ్‌ నివేదిక ప్రకారం 2025లో అమ్మకాల విలువపరంగా యాపిల్‌ మార్కెట్‌ వాటా 28 శాతానికి పెరిగింది. 2024లో ఇది 23 శాతంగా నమోదైంది. అమ్మకాల పరిమాణంపరంగా వృద్ధి స్థిరంగానే ఉన్నప్పటికీ, కొనుగోలుదారులు ఖరీదైన మోడల్స్‌ కోసం ఫోన్లను ఎక్స్ఛేంజ్‌ చేసుకునే ధోరణి పెరుగుతుండటంతో విలువపరంగా మార్కెట్‌ వేగంగా వృద్ధి చెందుతోంది. ఐఫోన్‌ 16 సిరీస్‌ విజయవంతం కావడం, ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్‌ స్కీములు, ఎక్సే్చంజ్‌ ఆఫర్లు మొదలైన అంశాల కారణంగా 2025లో 28 శాతం వాటాతో మార్కెట్‌పై యాపిల్‌ ఆధిపత్యం దక్కించుకుంది. పండుగల సందర్భంగా ప్రచార కార్యక్రమాలు, నెట్‌వర్క్‌ను భారీగా విస్తరించడం కూడా ఇందుకు దోహదపడ్డాయి. నివేదిక ప్రకారం 2025లో దేశీ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ పరిమాణంపరంగా 1 శాతం, విలువపరంగా 8 శాతం వృద్ధి చెందింది. గతేడాది ఆఫ్‌లైన్‌ రిటైల్‌ మార్కెట్లో పరిమాణంపరంగా 40 శాతం స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాలు ఫైనాన్సింగ్‌ మార్గంలో జరిగాయి. రూ. 30,000కు పైన ఉండే ప్రీమియం సెగ్మెంట్లో మూడింట రెండొంతుల విక్రయాలు రుణాల రూపంలో నమోదయ్యాయి. కస్టమర్లు ఖరీదైన డివైజ్‌లకు అప్‌గ్రేడ్‌ కావడంలో ఈఎంఐ ఆప్షన్లు కీలక పాత్ర పోషిస్తుండటాన్ని ఇది సూచిస్తోంది. గతంలో దేశీ మార్కెట్‌ వృద్ధికి ఎంట్రీ, బడ్జెట్‌ సెగ్మెంట్ల ఫోన్లు ప్రధాన చోదకాలుగా ఉండేవి. కానీ ప్రీమియమైజేషన్‌ వైపు వినియోగదారులు మొగ్గు చూపుతుండటంతో ప్రీమియం ఫోన్ల విభాగం ఈ రెండు సెగ్మెంట్లకు మించి వృద్ధి చెందుతోంది. 

Post a Comment

0 Comments

Close Menu