Ad Code

యూపీఐ ద్వారా రికార్డు స్థాయిలో రూ.230 లక్షల కోట్ల విలువైన డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ నమోదు !


గత సంత్సరం డిసెంబర్ వరకు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ ద్వారా రికార్డు స్థాయిలో రూ.230 లక్షల కోట్ల విలువైన డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్ నమోదయ్యాయని ప్రభుత్వం మంగళవారం రాజ్యసభకు మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో అనుబంధ ప్రశ్నలకు సమాధానమిస్తూ, ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ యూపీఐ ద్వారా లావాదేవీల విలువ వేగంగా పెరుగుతోందని అన్నారు. 2022-23లో మొత్తం లావాదేవీల విలువ రూ.139 లక్షల కోట్లు కాగా, డిసెంబర్ 2025-26 నాటికి రూ.230 లక్షల కోట్లకు చేరుకుందని వివరించారు. కరెన్సీ మార్పిడి, స్థానిక చట్టాలకు అనుగుణంగా ఎనిమిది దేశాలలో ఉపయోగంలో ఉందని మంత్రి తెలియజేశారు. యూపీఐ ప్రస్తుతం భూటాన్, ఫ్రాన్స్, మారిషస్, నేపాల్, ఖతార్, సింగపూర్, శ్రీలంక, యూఏఈలలో పనిచేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. యూపీఐ అంతర్జాతీయ విస్తరణ కోసం ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎన్పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్స్ లిమిటెడ్ సంయుక్తంగా అనేక చర్యలు తీసుకుంటున్నాయని ఆమె తెలియజేశారు.

Post a Comment

0 Comments

Close Menu