న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన బిజినెస్ స్టాండర్డ్ మంథన్ లో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ భారత్ 2047 విజన్ కు శక్తి చోదకాలుగా ఏఐ, ఈవీ, హైడ్రోజన్ నిలవబోతున్నాయని అన్నారు. ఆన్ రోడ్ టు 2047' అనే శీర్షికతో ఈ కార్యక్రమంజరిగింది. AI-ఆధారిత మౌలిక సదుపాయాలు, ప్రత్యామ్నాయ ఇంధనాలు, తక్కువ లాజిస్టిక్స్ ఖర్చులు రహదారి భద్రతా సంస్కరణలను భారతదేశ దీర్ఘకాలిక వృద్ధిని అనుసంధానించే బ్లూప్రింట్ అన్నారు. ప్రాజెక్టు డీపీఆర్ సిద్ధం చేయడానికి, ఆక్రమణలు,కొండచరియలు విరిగిపడే ప్రాంతాలను ముందుగానే గుర్తించడానికి రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ AI, ఉపగ్రహ చిత్రాలను ఉపయోగిస్తోందన్నారు. AI వంద శాతం వేగం, సామర్థ్యాన్ని పెంచుతుందని చెప్పారు. టోల్ ప్లాజాలలో రద్దీని తొలగించడానికి ఏఐని కూడా ఉపయోగిస్తున్నామని ఈ సంవత్సరం చివరి నాటికి భారతదేశంలో టోల్ ప్లాజాల వద్ద ఎక్కడా క్యూలు ఉండవని అని గడ్కరీ చెప్పారు. ఎలక్ట్రిక్ మొబిలిటీలో భారతదేశం అత్యధిక వృద్ధి రేటును చూస్తోందని గడ్కరీ అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలలో ఇప్పటికే 30-40 శాతం పెరుగుదల ఉంది. కొన్ని మోడళ్లకు, వెయిటింగ్ లిస్ట్ ఉందన్నారు. లిథియం-అయాన్ బ్యాటరీ ఖర్చులు kWh కి150 డాలర్ల నుండి kWh కి 55 డాలర్లకు తగ్గాయి. ఆరు నెలల్లో పెట్రోల్, డీజిల్, ఎలక్ట్రిక్ వాహనాల ధర సమానంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పెట్రోల్ లేదా డీజిల్ కార్ల నెలవారీ నిర్వహణ ఖర్చు రూ.25,000-రూ.30,000గా ఉంటే అదే ఎలక్ట్రిక్ వాహనాల నెలవారీ నిర్వహణ ఖర్చు రూ.3,000-రూ.4,000గా ఉంటుందని ఆయన అంచనా వేశారు. హైడ్రోజన్ కిలోకు 1 డాలర్ నా కల అన్నారు. ఈ విషయంలో నేను మీకు హామీ ఇవ్వడం లేదు. ప్రకటించడం లేదు. కానీ నా లక్ష్యం కిలోకు 1 డాలర్ చొప్పున హైడ్రోజన్ లభించేలా చేయడం నా కల అని చెప్పారు.
0 Comments