దేశీయ మార్కెట్లో బ్రేవ్ తాజాగా ఆర్క్ 2 ఇన్ 1 ఆండ్రాయిడ్ పీసీను తీసుకొచ్చింది. ఇది స్నాప్‌డ్రాగన్ చిప్ తో పనిచేస్తుంది. 8 స్పీకర్ యూనిట్ ను కలిగి ఉంది. 14500mAh భారీ బ్యాటరీతో లాంచ్ అయింది. లాంచ్ ఆఫర్ లో భాగంగా ప్రత్యేక ప్రయోజనాలను కల్పిస్తున్నట్లు సంస్థ చెబుతోంది. ఈ ఆండ్రాయిడ్ పీసీ 144Hz రీఫ్రెష్ రేట్ తో 12.95 అంగుళాల (2880 x 1840 పిక్సల్స్) 2.8K LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ డిస్‌ప్లే 264 ppi, 700 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ ను కలిగి ఉంది. HDR10 ను సపోర్టు చేస్తుంది. 7.6mm మెటల్ బాడీని కలిగి ఉంది. ఈ బ్రేవ్ ఆర్క్ పీసీ ఆక్టా కోర్ 4nm స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 మొబైల్ ప్లాట్‌ఫాం ప్రాసెసర్ ను కలిగి ఉంది. దీంతోపాటు Adreno 737 GPU ను కూడా అమర్చారు. ఈ ట్యాబ్లెట్ 12GB ర్యామ్, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. మైక్రో SD కార్డుతో 1TB వరకు స్టోరేజీని సపోర్టు చేస్తుంది. ఈ ట్యాబ్లెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత OS పైన పనిచేస్తుంది. ఆర్క్ పెన్ స్టైలస్ ను సపోర్టు చేస్తుంది. నోట్స్ రాసుకొనేందుకు, డ్రాయింగ్ కోసం అనుకూలంగా ఉంటుందని చెబుతోంది. ఒక్కసారి ఛార్జింగ్ చేసి 20 గంటల వరకు వినియోగించుకోవచ్చు. ఈ ఆండ్రాయిడ్ పీసీ 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో 14,550mAh బ్యాటరీతో పనిచేస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జింగ్ చేసి రెండు రోజులపాటు వినియోగించుకోవచ్చని సంస్థ చెబుతోంది. కెమెరా విభాగం పరంగా ఆటోఫోకస్ సామర్థ్యంతో 13MP కెమెరా, 5MP సెల్ఫీ కెమెరా ఉంది. దీంతోపాటు LED ఫ్లాష్ లైట్ కూడా ఉంది. ఈ ట్యాబ్లెట్ DTS ఆడియో సపోర్టుతో 8 స్పీకర్ లను కలిగి ఉంటుంది. దీంతోపాటు నాయిస్ రిడక్షన్ సపోర్టుతో అనలాగ్ సిలికాన్ మైక్ ను కలిగి ఉంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 5.4, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. ఈ ట్యాబ్లెట్ ట్యాప్‌టాప్ మోడ్ లో వినియోగించుకోవచ్చు. గెలాక్టిక్ బ్లూ కలర్ వేరియంట్ లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఈ ట్యాబ్లెట్ తొలి 200 కొనుగోలుదారులకు కీబోర్డు, లెదర్ కేస్ ను ఉచితంగా ఉందిస్తామని కంపెనీ చెబుతోంది.
0 Comments