Ad Code

టాటా XPRES సెడాన్ పెట్రోల్, సీఎన్జీ వేరియంట్లలో విడుదల


దేశీయ మార్కెట్లో టాటా మోటార్స్ XPRES సెడాన్‌ను పెట్రోల్, సీఎన్జీ  వేరియంట్లలో విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ప్రత్యేకంగా ఫ్లీట్ ఆపరేటర్ల కోసం రూపొందించారు. తక్కువ రన్నింగ్ ఖర్చులు, విశ్వసనీయత, పెద్ద బూట్ స్పేస్, లాంగ్ టైం వారంటీ వంటివి దీనిని మార్కెట్ లో ప్రత్యేకంగా నిలబెడుతున్నాయి.70 లీటర్ల ట్విన్-సిలిండర్ సీఎన్జీ ట్యాంక్ ఈ సెగ్మెంట్‌లో మొదటిసారి అందించబడింది. బూట్ స్పేస్‌ను తగ్గించకుండా ఎక్కువ దూరం ప్రయాణం చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అదనంగా 5 సంవత్సరాలు లేదా 1,80,000 కిలోమీటర్ల వరకు వారంటీ అందించబడుతుంది. ఈ XPRES సెడాన్ మోడల్ టాటా మోటార్స్ వాణిజ్య మార్కెట్‌లో తన స్థానాన్ని నిలబెట్టుకునే దిశగా లాంచ్ చేసింది. దీనిని ప్రత్యేకంగా ఫ్లీట్ ఆపరేటర్ల కోసం రూపొందించారు.ఈ కారు 1.2 లీటర్ల రేవోట్రోన్ పెట్రోల్ ఇంజిన్ , సీఎన్జీ వేరియంట్ లలో వస్తుంది.పెట్రోల్ ఇంజన్ 86 PS పవర్,113 Nm టార్క్ ను అందిస్తుంది. సీఎన్జీ వేరియంట్ 75.5 PS పవర్,95 Nm టార్క్ ను అందిస్తుంది.5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ తో వస్తుంది. పెట్రోల్ వేరియంట్‌లో పవర్ఫుల్ పెర్ఫార్మన్స్ కలిగి ఉంటుంది. సీఎన్జీ  వేరియంట్‌లో తక్కువ రన్నింగ్ ఖర్చుల ను అందిస్తుంది. సీఎన్జీ  మోడల్‌లో 70 లీటర్ల ట్విన్ సిలిండర్ ట్యాంక్ ఉండటం వల్ల ఎక్కువ దూరం ప్రయాణించవచ్చు. పియానో బ్లాక్ గ్రిల్,3 డైమెన్షనల్ హెడ్ లాంప్,R14 వీల్ కవర్లు,రెడ్ లెన్స్ టెయిల్ లంప్స్, స్పేసియస్ & కంపార్ట్ క్యాబిన్,హైట్ అడ్జెస్ట్ డ్రైవర్ సీట్,టిల్ట్ స్టీరింగ్ లాంటివి ఉన్నాయి. ప్రీమియం డ్యూయల్ టోన్ ఇంటీరియర్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్స్, ABS,రివర్స్ పార్కింగ్ కెమెరా రియర్ పార్కింగ్ సెన్సర్స్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్స్, CNG లీక్ డిటెక్షన్,ఫాగ్ లాంప్స్ ఉన్నాయి . బూట్ స్పేస్ పెట్రోల్‌లో 419 లీటర్లు, CNGలో 227 లీటర్లు ఉంటుంది. 5 సంవత్సరాలు లేదా 1,80,000 km వారంటీ అందించబడుతుంది. ఇది వైట్, సిల్వర్, గ్రే, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. పెట్రోల్ వేరియంట్ ఎక్స్ షో రూమ్ ధర ₹5.59 లక్షల నుండి ప్రారంభమవుతుండగా, సీఎన్జీ వేరియంట్ ఎక్స్ షూ రూమ్ ధర ₹6.59 లక్షలు .

Post a Comment

0 Comments

Close Menu