Ad Code

పెరుగుతున్న


నవరి 1 నుంచి జనవరి 17వ తేదీ వరకు వెండి ధర దాదాపు 70 వేలు పెరిగింది. ఈ పెరుగుదల చూసి బులియన్ మార్కెట్ పండితులు కూడా ఆశ్చర్యపోతున్నారు. 2026 సిల్వర్ ఔట్ లుక్ ప్రకారం బ్యాంక్ ఆఫ్ అమెరికా ఒక ఔన్స్ వెండి ధర 80 డాలర్లకు చేరకుంటుందని అంచనా వేసింది. కానీ అంచనాలు 2025 డిసెంబర్ లోనే దాటిపోవడం గమనించవచ్చు. మరోవైపు సిల్వర్ ధరలు ఏ ఆర్థిక సంస్థ అంచనా వేయని విధంగా ఏకంగా 90 డాలర్లకు వెళ్లిపోయింది. అయితే రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకీ వెండి ధర 200 డాలర్లు ఒక ఔన్స్ వరకూ చేరవచ్చని అంచనా వేస్తున్నారు. బంగారం, వెండి, వైపు పెట్టుబడులు భవిష్యత్తులో మరింత పెరగవచ్చని పేర్కొంటున్నారు. అయితే వెండి బంగారం కంటే వేగంగా పెరగవచ్చని చెబుతున్నారు. అయితే ఈ భారీ పెరుగదల ర్యాలీ అనంతరం వెండిలో భారీ కరెక్షన్ వచ్చే అవకాశం ఉందని నిపుణుల అంచనా వేస్తున్నారు. సాధారణంగా వెండి ధర అంతర్జాతీయ మార్కెట్ లో స్పాట్ ధర ఆధారంగా నిర్ణయిస్తారు. దీనిపై దేశీయంగా గనమించినట్లయితే మన దేశంలో వెండి ఉత్పత్తి ఎక్కువగా లేదు. విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే వెండి ధరను దేశీయంగా కస్టమ్స్ డ్యూటీ, జీఎస్టీ, లాజిస్టిక్స్, రిఫైనింగ్, ట్రేడింగ్ మార్జిన్ నిర్ణయిస్తాయి. ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం 90 డాలర్ల ఉండగా ఒక కేజీ వెండి ధర దేశీయంగా 3 లక్షల రూపాయలు పలుకుతుండగా, భవిష్యత్తులో వెండి ధర 200 డాలర్లకు ఒక ఔన్స్ చొప్పున పెరిగితే ఒక కేజీ వెండి ధర 6 లక్షల రూపాయలు అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.


Post a Comment

0 Comments

Close Menu