Ad Code

ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు : బస్సు డ్రైవర్‌తో పాటు పలువురికి స్వల్ప గాయాలు


ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా బాపులపాడు మండలం కానుమోలు సమీపంలో జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీని ఆర్టీసీ బస్సు  బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో ప్రయాణికులు ఉండటంతో ఒక్కసారిగా భయాందోళనలు నెలకొన్నాయి. అయితే అదృష్టవశాత్తూ ఎటువంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనలో బస్సు డ్రైవర్‌తో పాటు పలువురు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గురైన బస్సును రహదారిపై నుంచి తొలగించి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ప్రమాదానికి ప్రధాన కారణం తెల్లవారుజామున కురిసిన దట్టమైన పొగమంచు అని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. పొగమంచు కారణంగా రహదారిపై ఎదురుగా వస్తున్న వాహనాలు సరిగ్గా కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అనుమానిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu