పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో బిల్డర్, ఫైనాన్షియర్ అమన్‌దీప్ సింగ్ భార్య, పిల్లలను కాల్చి చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. అమన్‌దీప్ సింగ్ కు ఒక సెలూన్ షాపు కూడా అతడు నిర్వహిస్తున్నాడు. భార్య జస్వీర్ కౌర్, ఇద్దరు కుమార్తెలతో కలిసి నివసిస్తున్నాడు. జనవరి 8న ఉదయం పనిమనిషి ఆ ఇంటికి వచ్చింది. ఎంతకీ డోర్ తీయకపోవడంతో అద్దెకు ఉన్న వ్యక్తి, పొరుగువారిని పిలిచింది. వారు తలుపులు పగులగొట్టి ఇంట్లోకి వెళ్లి చూడగా అమన్‌దీప్ సింగ్, భార్య, వారి పిల్లలు రక్తం మడుగుల్లో పడి మరణించడాన్ని గమనించారు. అక్కడ ఒక పిస్టల్ కూడా వారికి కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి పరిశీలించి అమన్‌దీప్ సింగ్ పిస్టల్‌తో భార్య, ఇద్దరు కుమార్తెలను చంపి ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానించారు. ఫోరెన్సిక్ బృందాన్ని రప్పించి ఆధారాలు సేకరించారు. ఆ గదిలో నేలపై పడి ఉన్న పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నారు. నలుగురి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఫిరోజ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. వారింట్లో అద్దెకు ఉంటున్న వ్యక్తి, పొరుగువారు, స్థానికుల స్టేట్‌మెంట్లను రికార్డ్ చేసినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
పిస్టల్‌తో భార్య, బిడ్డలను కాల్చి చంపి, ఆత్మహత్య చేసుకున్న ఫైనాన్షియర్ !
Friday, January 9, 2026
crime Financier shoots wife and children dead with a pistol Firozpur district punjab Singh also ran a salon then commits suicide
No comments:
Post a Comment