తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. అధికార డీఎంకేను గద్దె దించేందుకు ఏకతాటిపైకి రావాలనే వ్యూహంతో ప్రతిపక్షాలు పావులు కదుపుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమిలో పట్టాలి మక్కల్ కట్చి పార్టీ చేరింది. ఇవాళ ఏఐఏడీఎంకే అధినేత, ఆ రాష్ట్ర మాజీ సీం పళణిస్వామితో పీఎంకే అధినేత అన్బుమణి రామదాస్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పళినిస్వామితో కలిసి రామదాస్ ఉమ్మడిగా మీడియాతో మాట్లాడుతూ ఏఐడీఎంకేతో పొత్తు కుదిరిందని వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తామంతా కలిసి పోటీ చేస్తామని తమిళనాడులో తప్పకుండా ఎన్డీయే విజయం సాధించబోతోందని రామదాస్ ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు ముక్కలు ముక్కలుగా చీలిపోవడం వల్లే గతంలో డీఎంకే విజయం సాధించందని ఇక అలా జరగకూడదనే పళనిస్వామి నాయకత్వంలో ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకం అవుతున్నాయని చెప్పారు. రామదాస్ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన పళని స్వామి రాబోయే అసెంబ్లీ ఎన్నికల వేళ ఎన్‍డీఏలో పీఎంకే చేరిందని చెప్పారు. తాము ఇప్పటికే బీజేపీతో పెట్టుకున్నామని త్వరలోనే మరికొన్ని పార్టీలు తమ కూటమిలో చేర్చుకుంటామని మాది 'విక్టరీ అలయెన్స్' అని ప్రకటించారు. మరోవైపు యాక్టర్ విజయ్ స్థాపించిన పార్టీ టీవీకేను ఎన్‍డీఏలో చేర్చుకునేందుకు బీజేపీ సీరియస్ గా ప్రయత్నిస్తోందనే ప్రచారం జరుగుతున్న వేళ విపక్ష కూటమిలోకి తాజాగా పీఎంకే వచ్చి చేరడం ఆసక్తిగా మారింది. అయితే స్టాలిన్ నేతృత్వంలో అధికార డీఎంకే పార్టీని ఓడించేందుకు ప్రతిపక్షాలు కలిసి రావాలని ముఖఅయంగా విజయ్ మాతో కలిసి వచ్చినా కలుపుకుపోతామని గతంలో పళనిస్వామి ప్రకటించారు.
0 Comments