బెంగళూరులోని యలహంక సమీపంలోని అగ్రహార లేఅవుట్‌లో నివసించే సంగమేశ్ అనే ఆటో డ్రైవర్ కుటుంబం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళింది. ఇది గమనించిన కిలాడీ లేడీలు, పట్టపగలే తాళం పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. ఇంట్లోని నగదు, విలువైన వస్తువులను దోచుకుని తమ స్కూటీపై పరారయ్యారు. బాధితుడు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన సంపిగేహళ్లి పోలీసులు ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలించారు. అందులో ఇద్దరు అబ్బాయిలు స్కూటీపై వచ్చి దొంగతనం చేసినట్లు స్పష్టంగా కనిపించింది. ఆ వాహనం నంబర్ ఆధారంగా నిందితులను వెంబడించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. తీరా స్టేషన్‌కు తరలించి విచారించగా, వారు అబ్బాయిలు కాదని, యువతులని తేలడంతో పోలీసులు షాక్ అయ్యారు. వారి నుంచి దొంగిలించిన సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు, నిందితులను రిమాండ్‌కు తరలించారు.
0 Comments