76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అవార్డులను ప్రకటించింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలలో విశిష్ట సేవలు చేసిన వ్యక్తులకీ ఈ అవార్డులు ఇవ్వబడ్డాయి. కేంద్రం ప్రకటించిన 113 పద్మశ్రీ అవార్డుల్లో తెలుగు రాష్ట్రాల నుంచి 11 మంది ఎంపికయ్యారు. తెలంగాణ నుంచి సైన్స్ అండ్ ఇంజినీరింగ్ విభాగంలో చంద్రమౌళి, కుమారస్వామి తంగరాజ్, కృష్ణమూర్తి, మెడిసిన్‌లో వెంకట్ రావు, విజయ్ ఆనంద్, రామారెడ్డి (పశు-వైద్య పరిశోధనలు), దీపికా రెడ్డి (కళా విభాగం) ఎంపికయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వెంపటి కుటుంబ శాస్త్రి (సాహిత్యం), కళా విభాగంలో బాలకృష్ణ ప్రసాద్, నటులు మురళీ మోహన్, నటులు రాజేంద్రప్రసాద్ ఉన్నారు.
0 Comments