Ad Code

ప్రీమియం క్లాస్ బస్సుల్లో తగ్గించిన కేఎస్ఆర్టీసీ


ర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రీమియం క్లాస్ బస్సుల్లో తగ్గించింది. ఈ నెల 5వ తేదీన అమలులోకి వచ్చిన ఈ తగ్గింపు మూడు నెలల పాటు కొనసాగుతుంది. వారంలో నాలుగు రోజులు సోమ, మంగళ, బుధ, గురువారాల్లో అందుబాటులో ఉంటుంది. రద్దీ అధికంగా ఉండే శుక్ర, శని, ఆదివారాల్లో ఈ తగ్గింపు ఉండదు. ఈ మూడు రోజుల్లో యధాతథ ఛార్జీని వసూలు చేస్తారు. తక్కువ డిమాండ్ ఉండే సీజన్‌లో ప్రయాణీకులను ఆకట్టుకోవడానికి, ఆక్యుపెన్సీ రేషియో పెంచుకోవడానికి ఎంపిక చేసిన మార్గాల్లో ఈ తగ్గింపును కేఎస్ఆర్టీసీ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న ప్రయాణ ఛార్జీలో 5 నుండి 15 శాతం వరకు తగ్గించింది. బెంగళూరు, మైసూరు, మంగళూరు, దావణగెరె డివిజన్లలోని అన్ని ప్రధాన ప్రీమియం బస్సు సేవలకు వర్తిస్తుంది. తిరుపతి, హైదరాబాద్, చెన్నై, పుదుచ్చేరి వంటి ప్రముఖ నగరాలకు నడిచే అంతర్రాష్ట్ర సర్వీసులకు కూడా ఈ ప్రయోజనం వర్తిస్తుంది. కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడిచే 'ఫ్లై బస్' సేవలకు కూడా రాయితీలు వర్తిస్తాయి. బెంగళూరు-మంగళూరు, బెంగళూరు-కుందాపుర, బెంగళూరు-పూణే, బెంగళూరు-ముంబై వంటి పలు కీలక మార్గాలతో పాటు కర్ణాటకలోని వివిధ గమ్యస్థానాలు, పొరుగు రాష్ట్రాలకు వెళ్లే అనేక బస్సు మార్గాలలో టిక్కెట్ ధరలు తగ్గాయి. రెండు వైపులా ప్రయాణానికి సంబంధించిన బుకింగ్‌లను ఒకేసారి చేస్తే, ప్రయాణ ఛార్జీలపై 10 శాతం తగ్గింపును అందిస్తున్నట్టు సంస్థ వెల్లడించింది. వోల్వో, అంబారీ, క్లబ్ క్లాస్, పల్లకి ఉత్సవ్, ఫ్లై బస్, రాజహంస, నాన్-ఏసీ స్లీపర్, ఐరావత, ఐరావత క్లబ్ క్లాస్, ఏసీ స్లీపర్, మల్టీ-యాక్సిల్ ఏసీ స్లీపర్ వంటి ప్రముఖ బస్సుల్లోని ఎంపిక చేసిన మార్గాల్లో టికెట్ ఛార్జీలు 5 నుంచి 15 శాతం వరకు తగ్గింది.

Post a Comment

0 Comments

Close Menu