Ad Code

భారీ ఆపరేషన్‌ నిర్వహించి ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి విడిపించిన హైడ్రా


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మియాపూర్‌లో హైడ్రా భారీ ఆపరేషన్‌ నిర్వహించింది. రూ.3వేల కోట్లకుపైగా విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమార్కుల చెర నుంచి విడిపించింది. మక్తా మహబూబ్‌ పేటలోని సర్వే నెంబరు 44లో తప్పుడు పత్రాలతో 43 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 159 సర్వే నెంబర్‌లోని భూమి పత్రాలతో సర్వే నెం.44లోని ప్రభుత్వ భూమిలో ఇప్పటికే ఎకరంన్నర వరకు ఇమ్రాన్‌ అనే వ్యక్తి కబ్జా చేయగా అతనిపై కేసు నమోదైంది. అలాగే మరో 5 ఎకరాలను కూడా ఆక్రమణల చెర నుంచి హైడ్రా విడిపించింది. మియాపూర్‌ - బాచుపల్లి ప్రధాన రహదారికి సమాంతరంగా చెరువు కట్టపై 200 టర్ల మేర మట్టి పోసి ఏర్పాటు చేసిన 18 షెట్టర్లను కూడా హైడ్రా తొలగించింది. ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయన్న ఫిర్యాదుపై స్పందించిన హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌.. సర్వే నెం.44లోని ప్రభుత్వ భూమిపై విచారణ జరిపించారు. అందులోని అక్రమ రిజిస్టేష్రన్లపై ఆరా తీశారు. కబ్జాదారుల కన్ను ప్రభుత్వ భూమిపై పడిందని నిర్దారించిన హైడ్రా అధికారులు.. సమగ్ర విచారణ జరిపి మక్తా మహబూబ్‌ పేటలోని ఆ భూమిని స్వాధీనం చేసుకొని చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసి బోర్డులు పెట్టారు.

Post a Comment

0 Comments

Close Menu