ఫాల్కన్ ఎండీ అమర్ దీప్‌ను ముంబైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గల్ఫ్ నుంచి ముంబైకి వచ్చిన అమర్ దీప్‌ను పోలీసులు పట్టుకున్నారు. ముంబై ఇమ్రిగేషన్ అధికారుల సమాచారంతో ఫాల్కన్ ఎండీని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. ఫాల్కన్ ఎండీపై ఇప్పటికే ఎల్ఓసీ జారీ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ముంబై వచ్చిన వెంటనే ఆయనను అదుపులోకి తీసుకున్నారు. డిజిటల్ డిపాజిట్ల పేరుతో 850 కోట్ల రూపాయలను అమర్ దీప్ కొట్టేసిన విషయం తెలిసిందే. ఎమ్‌ఎన్‌సీ కంపెనీలో పెట్టుబడుల పేరులో డబ్బుల వసూలు చేశాడు. యాప్ బేసిడ్ డిజిటల్ డిపాజిట్ల పేరుతో స్కాంకు పాల్పడ్డారు అమర్ దీప్. అంతేకాకుండా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడతానంటూ బురిడీ కొట్టించాడు. ఫాల్కన్ స్కాం వెలుగులోకి రాగానే అమర్ దీప్ దంపతులు చార్టెడ్ ఫ్లైట్‌లో దుబాయ్‌కు పారిపోయారు. ఈ కేసులో ఇప్పటికే సీఈఓతో పాటు అమర్ దీప్ సోదరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.
0 Comments