అమెరికాలోని లాస్‌వేగాస్‌లో జరిగిన కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2026 వేదికగా ఈరోజు మోటరోలా రేజర్ ఫోల్డబుల్ మోడల్‌ను అధికారికంగా ప్రకటించింది. మోటరోలా స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోలో ఇది సరికొత్త ఫామ్ ఫ్యాక్టర్‌తో వచ్చిన ఫోల్డబుల్ డివైస్. ఇప్పటికే ఉన్న రేజర్ ఫ్లిప్ తర్వాత కంపెనీ నుంచి వచ్చిన రెండో ఫోల్డబుల్ ఫోన్ ఇదే కావడం విశేషం. కస్టమర్ జీవనశైలికి అనుగుణంగా మారేలా ఫ్లెక్సిబుల్ లేఅవుట్లు, ఇంటర్‌ఫేస్‌లతో ఈ ఫోన్ రూపొందించామని కంపెనీ పేర్కొనింది. దీనిలో 8.1 అంగుళాల LTPO LTPO 2K రిజల్యూషన్ ఉన్న ఇన్నర్ డిస్‌ప్లేతో పాటు 6.6 అంగుళాల కవర్ డిస్‌ప్లేను అందిస్తుంది. ఇది అధిక నాణ్యత విజువల్స్‌తో పాటు స్మూత్ అనుభూతిని అందించేలా LTPO టెక్నాలజీతో రూపొందించారు. ఫోన్‌లో మోటో పెన్ అల్ట్రా స్టైలస్ ఇన్‌పుట్ కు సపోర్ట్ ఉండటం వల్ల నోట్స్, డూడులింగ్, స్క్రీన్‌పై నేరుగా రాయడం వంటి పనులు సులభంగా చేయొచ్చు. ఈ ఫోన్‌కు కర్వ్డ్ ఎడ్జ్‌లు, ఆకర్షణీయమైన హింజ్ డిజైన్, మోటరోలా ఇతర స్మార్ట్‌ఫోన్లను పోలి ఉండే రియర్ కెమెరా మాడ్యూల్‌ను అందించారు. కవర్ స్క్రీన్‌పై సెల్ఫీ కెమెరా కోసం మధ్యలో హోల్-పంచ్ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. అలాగే, ఇన్నర్ డిస్‌ప్లేలో సెల్ఫీ కెమెరాను ఒక మూలలో అమర్చారు. ఫోటోగ్రఫీ విభాగంలో మోటరోలా మరోసారి బలమైన ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్ ఉంది. 50MP Sony LYTIA మెయిన్ సెన్సార్. 50MP పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా (3x ఆప్టికల్ జూమ్). 50MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్ తో పాటు కవర్ స్క్రీన్‌పై 32MP సెల్ఫీ కెమెరా, ప్రధాన ఫోల్డెడ్ స్క్రీన్‌పై 20MP సెల్ఫీ సెన్సార్ ను జోడించారు. ఈ కెమెరా వ్యవస్థ డాల్బీ విజన్ వీడియో రికార్డింగ్ కు సపోర్ట్ చేస్తుందని కంపెనీ ప్రకటించింది. అలాగే, ఫోన్ ద్వారా డాల్బీ విజన్ లో వీడియోలు షూట్ చేయొచ్చు, క్వాలిటీ కంటెంట్ క్రియేషన్‌కు ఇది మంచి ఆప్షన్ అని పేర్కొన్నారు. దీనిలో పలు ఏఐ ఆధారిత ఆన్-డివైస్ ఫీచర్లు కూడా ఉన్నాయి. కాల్స్, మెసేజ్‌లకు సంబంధించిన సమరీలను అందిస్తుంది. ప్రతి నోటిఫికేషన్‌ను ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం లేదు. వినియోగదారుడి స్క్రీన్ కంటెంట్ ఆధారంగా పర్సనలైజ్డ్ సూచనలు, రికమండేషన్లు చూపిస్తుంది. ఏఐ సామర్థ్యాలను మరింత తెలుసుకునేలా, వాటికి అనుగుణంగా మారేలా ఈ ఫోన్ స్మార్ట్‌గా యూజర్‌కు సహాయపడుతుందని మోటరోలా కంపెనీ పేర్కొంది.
0 Comments