బీఎంసీ ఎన్నికల మేనిఫెస్టో 'మహాయుతి వచన్ నామా'ను విడుదల


హారాష్ట్రలో బీఎంసీ ఎన్నికల మేనిఫెస్టోను మహాయుతి కూటమి ఆదివారంనాడు విడుదల చేసింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, కేంద్ర సహాయ మంత్రి రాందాస్ అథవాలే, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ తవ్డే తదితరులు 'మహాయుతి వచన్ నామా'ను విడుదల చేశారు. బీఎంసీతో సహా మహారాష్ట్ర మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు పోలింగ్ ఈనెల 15న జరుగనుంది. 16న ఫలితాలు ప్రకటిస్తారు. మహాయుతి కీలక హామీలు : వచ్చే ఐదేళ్లలో నీటి పన్నుల పెంపు నిలిపివేత, గర్గాయి, పింజల్, దమన్‌గంగా ప్రాజెక్టులను రాబోయే ఐదేళ్లలో పూర్తి చేసి ముంబైకి నీటి సరఫరాను పెంచడం, చిన్నతరహా పరిశ్రమ విధానాన్ని అమలు చేయడం, శిథిలమైన భవనాల పునరుద్ధరణ సహా రీవలప్‌మెంట్ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, బెస్ట్ బస్సులన్నింటినీ 2029 నాటికి ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చడం, 'బెస్ట్' బస్సులలో మహిళా ప్రయాణికులకు 50 శాతం రాయితీ, బస్సులను 5000 నుంచి 10,000 బస్సులకు పెంచడం, లడ్కీ బహిన్ లబ్ధిదారుల స్వయం సమృద్ధి, చిన్న తరహా వ్యాపారాలకు రూ.5 లక్షల వరకూ వడ్డీలేని రుణాలు, రోహింగ్యా, బంగ్లా అక్రమ వలసదారుల నుంచి ముంబైకి విముక్తి, పర్యావరణ పరిరక్షణ పథకాల కింద రూ.17,000 కోట్లు కేటాయింపు, పర్యాటకాన్ని ప్రమేట్ చేసేందుకు టూరిజం శాఖ ఏర్పాటు, బాలాసాహెబ్ ఠాక్రే శత జయంతి సందర్భంగా మరాఠీ యువతకు ప్రత్యేక కార్యక్రమాలు, ఆర్థిక చేయూత, బీఎంసీ మార్కెట్లలో చేపలు అమ్మేవారికి కోసం కోల్ట్ స్టోరేజ్‌ల నిర్మాణం, అన్ని కూరగాయల మార్కెట్ల పునరుద్ధరణ, చేపల దిగుమతులు, ఎగుమతుల కేంద్రాల ఏర్పాటు, స్టార్టప్ ఇంక్యుబేషన్ కేంద్రాలు నెలకొల్పడం, మున్సిపల్ కార్పొరేషన్ స్వతంత్రంగా మరాఠా భాషా శాఖ ఏర్పాటు, మరాటీ ఆర్ట్ సెంటర్లు, స్టడీ లైబ్రరీలు ఏర్పాటు చేయడం, 2024 నాటికి అభివృద్ధి చెందిన ముంబై లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయడం. 

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం