జాతీయ ఐఈడీ డేటా నిర్వహణ వ్యవస్థను ప్రారంభించిన అమిత్ షా


భారత దేశపు మొట్టమొదటి జాతీయ ఐఈడీ డేటా నిర్వహణ వ్యవస్థను కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఈరోజు ప్రారంభించారు. వర్చువల్‌గా మనేసర్‌లోని ఎన్ఎస్జీ గారిసన్ నుండి డేటా సెంటర్‌కు శ్రీకారం చుట్టారు. దేశ అంతర్గత భద్రతను మరింత బలోపేతం చేయడానికి భవిష్యత్తులో ఈ వ్యవస్థను మరింత మెరుగుపరుస్తామని హోం మంత్రి అమిత్ షా అన్నారు. ఈ సందర్భంగా హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ ఎన్ఐడీఎంఎస్ ను నేషనల్ సెక్యూరిటీ గార్డ్ అభివృద్ధి చేసిందని పేర్కొన్నారు. ఐడీఎంఎస్ ద్వారా దేశవ్యాప్తంగా చెల్లాచెదురుగా ఉన్న వివిధ రకాల డేటాను కేంద్రీకరించి ఒకే వేదికపైకి తీసుకువస్తారు. ఇది పరస్పరం అనుసంధానించిన ఉగ్రవాద సంఘటనలను గుర్తించడం సులభతరం చేస్తుంది. దర్యాప్తు వేగవంతం చేస్తుంది. 'ఒక దేశం, ఒక డేటా సెంటర్' దిశగా ఇది ఒక ప్రధాన అడుగుగా అభివర్ణించిన అమిత్ షా, ఏదైనా సంఘటనకు త్వరితంగా, మెరుగైన ప్రతిస్పందనను అందించడానికి సరైన సమయంలో ఏజెన్సీలకు ఖచ్చితమైన సమాచారం అందుబాటులో ఉంటుందని ఆయన అన్నారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్, ఇతర ఏజెన్సీలతో కలిసి గత 11 నెలలుగా ఈ వ్యవస్థను అభివృద్ధి చేసిందని నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్ బ్రిఘు శ్రీనివాసన్ అన్నారు. ఇది ఐఈడీ సంబంధిత డేటా సేకరణ, ఏకీకరణ, పంపిణీని క్రమబద్ధీకరించే సురక్షితమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్. ఈ వ్యవస్థ ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైజెస్ లకు సంబంధించిన సమాచారాన్ని ఒకే చోట ఏకీకృతం చేస్తుంది. ఇది బాంబు పేలుళ్ల తర్వాత దర్యాప్తును సులభతరం చేస్తుంది. భద్రతా సంస్థల మధ్య సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఎన్ఐడీఎంఎస్ అనేది రాష్ట్ర పోలీసులు, కేంద్ర పోలీసు దళాలు, ఇతర ఏజెన్సీలు నిజ సమయంలో సమాచారాన్ని పంచుకోవడానికి అనుమతించే సురక్షితమైన డిజిటల్ ప్లాట్‌ఫామ్. ఎన్ఎస్జీ దేశంలోని జీరో టెర్రర్ ఫోర్స్ అని, ప్రతి సవాలును ఎదుర్కొంటూ తన పౌరులకు భద్రతను అందిస్తుందని అన్నారు. ఎన్ఎస్జీ 24×7 కార్యాచరణ సామర్థ్యాలు, ఉన్నత స్థాయి శిక్షణ కారణంగా, భారతదేశం అన్ని రకాల ఉగ్రవాద ముప్పులను ఎదుర్కోగలదని ఆయన అన్నారు. బాంబు నిర్వీర్యం, ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలలో ప్రపంచవ్యాప్తంగా ఎన్ఎస్జీ తనకంటూ ప్రత్యేకతను చాటుకుంది. దీనిని భారతదేశానికి ప్రత్యేకమైన వేదికగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభివర్ణించారు. దేశంలోని అనేక ప్రాంతాలలో ఉగ్రవాద, తీవ్రవాద సంస్థలు ఐఈడీలను ఉపయోగిస్తున్నాయి. ఈ కొత్త వ్యవస్థ అటువంటి దాడులను నిరోధించడానికి, వాటి ప్రణాళికను అర్థం చేసుకోవడానికి, సకాలంలో చర్య తీసుకోవడానికి సహాయపడుతుంది. ఈ వేదిక దర్యాప్తు సంస్థలు గత కేసుల నుండి నేర్చుకోవడానికి, దాడి నమూనాలను గుర్తించడానికి, భవిష్యత్తు ముప్పులను అంచనా వేయడానికి కూడా సహాయపడుతుంది.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains