ఢిల్లీ ఉత్తర-పశ్చిమ ప్రాంతంలో ఉన్న షాలిమార్ బాగ్‌లో భర్త హత్య కేసులో కీలక సాక్షిగా ఉన్న భార్య రచనా యాదవ్‌ను శనివారం రాత్రి సమయంలో పాయింట్ బ్లాంక్‌లో రేంజ్‌లో గన్ గురిపెట్టి కాల్చి చంపేశారు. ఆమె సుమారు మూడేళ్ల క్రితం ఆమె భర్త విజేంద్ర యాదవ్‌ను కోల్పోయింది. 2023లో విజేంద్ర యాదవ్‌ను కొంతమంది హత్య చేశారు. ప్రస్తుతం ఆ కేసు అండర్ ట్రయల్‌లో ఉంది. ఆ కేసులో భార్య రచనా యాదవ్‌నే కీలక సాక్షిగా ఉన్నారు. అయితే ఇప్పుడు ఆమెను కూడా గుర్తుతెలియని కొందరు గన్‌తో కాల్చి చంపారు. భర్తను హత్య చేసిన నిందితులే ఆమెను హత్య చేసి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె షాలిమార్ బాగ్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ (ఆర్‌డబ్యూఏ)కు ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఆమెను తలపై కాల్చడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రచనా యాదవ్ భర్త విజేంద్ర యాదవ్ హత్య కేసులో ఐదుగురు నిందితులుగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు దశలో ఉన్న క్రమంలో భార్య రచనా యాదవ్‌ను కూడా హత్య చేయడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
0 Comments